Jagan Mind Data Artificial Intelligence.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ ప్రపంచం గిరగిరా తిరుగుతున్న రోజులివి.!
కంప్యూటర్ సైన్సెస్ ఇంజినీరింగ్‌లోనూ ఏఐ.! బీసీఏలో కూడా ఏఐ.. అసలు ఏఐ లేనిదెక్కడ.? మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే, అందులో మెటా ఏఐ దగ్గర్నుంచి, గ్రూక్ ఏఐ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే.
కానీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కి సరికొత్త అర్థం చెప్పారు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
Jagan Mind Data Artificial Intelligence.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటే, అంతేనా.?
ప్రస్తుతం కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏఐ గురించి మాట్లాడుతూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు.
డేటాకి మైండ్ అప్లయ్ చేస్తే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జియో డేటాకి మైండ్ అప్లయ్ చేస్తే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్… అంటూ సెటైర్లు పడుతున్నాయి సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
Also Read: ట్రంప్ లక్ష డాలర్ల దెబ్బ.! ఎన్ని H1B Visa వికెట్లు పడిపోతాయో.!
నిజానికి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్.! యుద్ధ రంగాన కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని వినియోగిస్తున్న రోజులివి.
అంత ప్రాముఖ్యత వున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పూర్తిగా తెలియాలనే రూల్ ఏమీ లేదు.
తెలియనప్పుడు, ఆ సబ్జెక్ట్ గురించి ప్రస్తావించకుండా వుండి వుంటే బావుండేది.. ఏదో మాట్లాడేయాలని, ఇంకోటేదో మాట్లాడేసి.. ట్రోల్ అవడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్తేమీ కాదు.!
బెంగళూరు నుంచి వచ్చి ప్రెస్ మీట్లు..
2024 ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత, వైసీపీ అధినేత వైఎస్ జగన్, బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వుండటానికే ఇష్టపడటంలేదాయన.
బెంగళూరు నుంచి అప్పుడప్పుడూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంటారు వైఎస్ జగన్. అలా వచ్చినప్పుడు, అరుదుగా ప్రెస్ మీట్లు పెడుతుంటారు.
తమ అధినేత కోసం వైసీపీ ముఖ్య నేతలు ప్రిపేర్ చేసిన స్క్రిప్టుని వైఎస్ జగన్, ఆ ప్రెస్ మీట్లలో చదివేస్తుంటారు. ఇవో చిత్రమైన ప్రెస్ మీట్లు. ఇలాంటివి దేశ రాజకీయాల్లో ఇంకెవరికీ సాధ్యం కావట్లేదు.
