Table of Contents
నీతో స్నేహంగా వున్నంతమాత్రాన నీవాళ్ళు కారు.. ఈ విషయం చిరంజీవికి ప్రజారాజ్యం పార్టీ పెట్టాకగానీ తెలియలేదు (Ali Ditches Pawan and Joins Jagan). సినీ పరిశ్రమలో చిరంజీవికి అత్యంత సన్నిహితులు చాలామందే వున్నారు.
చిరంజీవి పేరు చెప్పుకుని సినిమాల్లో ఎదిగిన చాలామంది, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేసరికి, ఆయనకు దూరమైపోయారు. రాజకీయాల్లో చిరంజీవిని సపోర్ట్ చేయలేదు సరికదా, చిరంజీవి దరిదాపుల్లో వుండకుండా జారుకోవడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇప్పుడు పవన్‌కళ్యాణ్ వంతు వచ్చినట్లుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రంగులు బయటపడుతున్నాయి. పవన్‌కళ్యాణ్ వెన్నంటే వుండేవారు ఆయనకు దూరమైపోతున్నారు. ఇది పవన్‌కళ్యాణ్ ముందే ఊహించి, ఎవర్నీ దగ్గరకు రానివ్వలేదు రాజకీయంగా.
అందుకే, జనసేనలో సినీ గ్లామర్ అనేది లేకుండా పోయింది. అయితే ఇటీవల పవన్‌తో అలీ రాజకీయ మంతనాలు (Ali Ditches Pawan and Joins Jagan) జరిపాక, పవన్ వెంట అలీ నడుస్తాడేమోనని అందరూ అనుకున్నారు. కానీ, అదీ జరగలేదు.
సినీ పరిశ్రమలో పవన్‌కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడెవరంటే ఠక్కున గుర్తుకొచ్చే రెండు పేర్లలో ఒకటి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది అయితే, ఇంకొకటి కమెడియన్ అలీ పేరు.
అలీ రాజకీయం.. ఎవరికీ అర్థం కాని వైనం.. Ali Ditches Pawan and Joins Jagan
జనసేనలో చేరేందుకోసం ఆ మధ్య పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయిన అలీ, ఆ తర్వాత మనసు మార్చుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అధినేతతోనూ మంతనాలు జరిపాడు. అక్కడా అలీకి పరిస్థితులు అనుకూలించలేదు. చివరికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు అలీ.
వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమంటూ జగన్‌తో భేటీ తర్వాత అలీ చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానులకు గట్టిగా గుచ్చుకుంటున్నాయి. అయితే అలీ తెలివైనోడు కదా, పవన్‌కళ్యాణ్ సక్సెస్ అయితే తాను సక్సెస్ అయినట్లు భావిస్తాననీ, పవన్‌కళ్యాణ్‌తో స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందనీ, స్నేహం వేరు రాజకీయం వేరనీ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు.
అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా అలీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పవన్‌కళ్యాణ్ మీద విమర్శలు చేయకుండా వుండగలడా.? జనసేనను ప్రశ్నించకుండా వుంటాడా.? ఈ ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. చంద్రబాబు మీద వైఎస్ జగన్‌కి ఎంత వ్యతిరేకత వుందో, పవన్ కళ్యాణ్ మీద కూడా జగన్‌కి అంతే వ్యతిరేకత వుంది.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జగన్ రాజకీయం..
చంద్రబాబు వ్యక్తిగత వ్యవహారాలపై ఎప్పుడూ విమర్శలు చేయని జగన్, పవన్‌కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే ప్రయత్నం చాలాసార్లు చేశారు. అంటే, చంద్రబాబు కంటే కూడా పవన్‌కళ్యాణ్‌పై వైఎస్ జగన్‌కి రాజకీయంగా ఎక్కువ శతృత్వం వుందని అనుకోవాలేమో.
2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అధికారం దక్కకపోవడానికి పవన్‌కళ్యాణే కారణమని గట్టి నమ్మకం వైఎస్ జగన్‌లో వుంది. అది కొంత నిజమే కావొచ్చు. ఎందుకంటే, చాలా తక్కువ ఓట్లతో మాత్రమే వైఎస్సార్సీపీ రెండో స్థానానికి పడిపోయింది ఆ ఎన్నికల్లో.
పవన్ గనుక చంద్రబాబుకి మద్దతిచ్చి వుండకపోతే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేదేనని జగన్ సహా వైఎస్సార్సీపీ నమ్మింది.
రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ అంటే ఖచ్చితంగా అది రెండు అవ్వాలనే రూల్ వుండదు. ఈక్వేషన్ బెడిసి కొట్టి జీరో కూడా అవ్వొచ్చు. అది తెలిసీ, పవన్‌ని జగన్ ఎందుకు రాజకీయ ప్రత్యర్థి అనుకున్నారో ఏమో. ఆ వైరం ఇప్పటికీ జగన్ కొనసాగించడం వల్ల ఆయనకు ఒరిగే లాభమేంటో!
అలీతో జనసేనకు జగన్ చెక్ పెట్టగలరా?
ఇదిలా ఉంటే, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, కృష్ణా అలాగే గుంటూరు జిల్లాల్లోనూ, కర్నూలుతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ అలీతో వైఎస్సార్సీపీతో ప్రచారం చేయించాలని వైఎస్ జగన్ అనుకుంటున్నారట.
ఈ నియోజకవర్గాల్లో పవన్‌కళ్యాణ్ ప్రభావం కొంత మేర వుండొచ్చనీ, అది అలీ ప్రచారంతో తగ్గుతుందనీ, తద్వారా రాజకీయంగా తమకు మేలు జరుగుతుందని (Ali Ditches Pawan and Joins Jagan) వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ భరోసా మంత్రి పదవి అట.!
అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇస్తామని వైఎస్ జగన్, అలీకి భరోసా ఇచ్చారని సమాచారం. ఆ ‘భరోసా’ గురించి అలీ పరోక్షంగా మీడియా ముందు చెప్పేయడం గమనార్హం.
అయితే, అలీ ద్వారా పవన్‌కళ్యాణ్ – వైఎస్ జగన్ రాజకీయంగా ఒక్కటయ్యే అవకాశాలున్నాయనీ, హంగ్ వస్తే పవన్ – జగన్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని, ఈ మొత్తం ఈక్వేషన్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారని ఇంకో ప్రచారం కూడా తెరపైకి వచ్చింది.