Janasena The King Maker.. 2024 ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలూ అస్త్ర శస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి.!
ఇంకోపక్క, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదానికి సంబంధించి పెద్దయెత్తున సర్వేలు జరుగుతున్నాయి. గతంలో అయితే, ఏడాదికో సర్వే జరగడం అనేది కనాకష్టం.
కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. నెలకో సర్వే తెరపైకి వస్తోంది. ఆయా సర్వేల్లోని అంచనాలు వాస్తవ ఫలితాలకు ఎంత దగ్గరగావుంటాయన్నది వేరే చర్చ.
నియోజకవర్గాల వారీగా ఆశావహులు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటుండడం నయా ట్రెండ్. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల సంగతి సరే సరి.
Janasena The King Maker.. జనసేనకు లాభమే.!
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణ ఫలితాన్ని చూసింది. అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది ఒకే ఒక్క అభ్యర్థి. ఆయన కూడా ఆ తర్వాత వైసీపీలోకి దూకేశారు.
అయితే, ఈసారి మాత్రం జనసేన పార్టీకి ఓట్లు గణనీయంగా పెరగనున్నాయ్. సీట్లు కూడా గణనీయంగానే పెరగబోతున్నాయ్. ఈ విషయాన్ని పలు సర్వేలు కుండబద్దలుగొట్టేస్తున్నాయి.
హీనపక్షం ఐదు అసెంబ్లీ సీట్లు జనసేనకు వస్తాయని దాదాపు అన్ని సర్వేలూ చెబుతున్నాయి. ఓ ఎంపీ సీటు కూడా జనసేన గెలుచుకునే అవకాశం వుందట.
తాజాగా వెలుగు చూసిన ఓ సర్వే జనసేన పార్టీకి ఏకంగా 14 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఈ శాతం 28 వరకూ పెరిగే అవకాశమూ లేకపోలేదట.
సీట్ల లెక్క చూసుకుంటే 15 నుంచి 25 సీట్ల వరకు జనసేన సొంతం చేసుకోబోతోందిట.
టీడీపీతో కలిస్తే..
రాజకీయాల్ల ‘రెండూ ప్లస్ మూడు.. మొత్తంగా ఐదు అయ్యే అవకాశాలూ వుంటాయి.. ఈక్వేషన్ తేడా కొట్టి ఒకటీ లేదా నాలుగు కూడా అవ్వొచ్చు.
టీడీపీ – జనసేన కలిస్తే ఖచ్చితంగా కొంత పాజిటివ్ ప్రభావం వుంటుందనే ప్రచారం జరుగుతున్నా, ఈ రెండూ కలిసి అధికారంలోకి వచ్చే అవకాశం వుంటుందా.? అంటే, దానిపై మళ్ళీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వచ్చే స్థాయిలో సీట్లు కొల్లగొట్టొచ్చని కొందరుకొన్ని సర్వేలు చెబుతోంటే, ఆ ఛాన్సే లేదని ఇంకొన్ని సర్వేలంటున్నాయి.
Also Read: పవన్ సాక్షిగా.! బాలయ్య నోట బండ్ల మంత్రం.!
ఎలా చూసినా జనసేన పార్టీకి అడ్వాంటేజ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో వుంటుందట సీట్లు, ఓట్ల పరంగా.!
ఒంటరిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా.. జనసేనకు లాభమే తప్ప నష్టం లేదన్నది అంతిమంగా అన్ని సర్వేలూ చెబుతున్నమాట.
ప్రస్తుతం ప్రచారంలో వున్న పై సర్వేని వైసీపీ సొంత సర్వేగా అభివర్ణిస్తున్నారు. వైసీపీ సొంత సర్వేలోనే జనసేనకు ఇంత అనుకూలత కనిపిస్తోంటే, వాస్తవ పరిస్థితి.. ఇంకెంత అనుకూలంగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు.