Janasena With TDP BJP.. రెండు రాజకీయ పార్టీలు చెరో వైపు వున్నాయి.! కానీ, ఆ రెండు పార్టీలూ ఒకదాన్నొకటి చూసుకోవడానికీ ఇష్టపడటంలేదు. అయితే, ఆ రెండు పార్టీలతోనూ విడివిగా పొత్తు పెట్టుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడిక లెక్కలు తేలిపోతాయ్.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్ల లాభనష్టాలేంటో జనసేన అధినేతకు ప్రాక్టికల్‌గా అర్థమయిపోతుంది.
ఇంకోపక్క, టీడీపీతో పొత్తు వల్ల కలిగే లాభనష్టాలపై ఇప్పటికే జనసేన అధినేత ఓ అంచనాకి వచ్చారు. ఖచ్చితంగా పొత్తు వల్ల జనసేనకీ, టీడీపీకీ లాభం వుంటుంది.
Janasena With TDP BJP.. ఇంకో ఆప్షన్ వుండదు..
టీడీపీ – జనసేన కలిస్తే, ఆ కూటమికి మద్దతివ్వడం తప్ప, బీజేపీ ముందర ఇంకో ఆప్షన్ వుండదు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెరవెనుకాల మద్దతిస్తోంది టీడీపీ.! అదే పెద్ద పంచాయితీ.
రాజకీయం అంటేనే అంత.! కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకీ టీడీపీ అనధికారిక మద్దతునిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది.
2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2019 ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క సీటు గెలవగలిగింది. కానీ, ఇప్పుడు ఈక్వేషన్ చాలా మారిపోయింది.
టీడీపీతో జర జాగ్రత్త..
జనసేన ఖచ్చితంగా డబుల్ డిజిట్ స్కోర్ చేసే అవకాశం వుంది. అయితే, జనసేన స్థాయిని తగ్గించడానికి టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తుంటుంది. ఆ ప్రయత్నాల్ని తిప్పికొడుతూనే, టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం అనేది జనసేన అధినేత ముందున్న టాస్క్.
బీజేపీ కూడా కలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో జనసేన రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. అలా రసవత్తరంగా మారాలంటే, తెలంగాణలో బీజేపీ – జనసేన కలిసి ‘మంచి’ ఫలితాలు సాధించాల్సి వుంటుంది.
ఒకవేళ జనసేన – బీజేపీ కాంబినేషన్ తెలంగాణలో హిట్టయితే, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో కలిసి పోటీ చేసినా, జనసేన అలాగే బీజేపీ.. ‘డిమాండ్ చేసే’ పొజిషన్లో వుంటాయ్.!