Janasenani Pawan Kalyan Bhimavaram.. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గాజువాక నుంచీ ఆయన పోటీ చేసి ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి (Pawan Kalyan) వ్యక్తిగతంగా అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి.
అందునా, భీమవరం నుంచే జనసేనాని మళ్ళీ పోటీ చేస్తే, గెలుపు విషయంలో ఎలాంటి అనుమానాల్లేవీసారి.. కానీ, మెజార్టీ గురించే జనసేన శ్రేణులు లెక్కలేసుకుంటున్నాయ్.
Janasenani Pawan Kalyan Bhimavaram.. అంతా సానుకూలమేనా.?
భీమవరం నుంచే జనసేనాని పోటీ చేస్తారా.? అన్న విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంకో అభ్యర్థి ఎవరూ జనసేనకి అక్కడ వున్నట్లు ప్రస్తుతానికైతే కనిపించడంలేదు.

తాజాగా, జనసేనాని పవన్ కళ్యాణ్ (Jana Senani Pawan Kalyan) భీమవరం వెళ్ళారు. కొద్ది రోజుల క్రితమే ఆయన భీమవరంలో పర్యటించాల్సి వున్నా, హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతులు లభించలేదు.
ఎలాగైతేనేం, జనసేనాని ఈ రోజు భీమవరంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నేతలతో చర్చిస్తున్నారు. మిత్రపక్షం టీడీపీకి సంబంధించిన నాయకులతోనూ చర్చలు జరుపుతున్నారు.
డబ్బు ప్రభావమెంత.?
గత ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో డబ్బు గెలిచిందన్న ప్రచారం ఇప్పటికీ వుంది. వైసీపీ ఈ సీటుని 2019 ఎన్నికల్లో గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Also Read: వేల కోట్ల రాజకీయం: ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం!
చివరి నిమిషంలో.. జరిగిన డబ్బు పంపిణీ కార్యక్రమం వైసీపీని గెలిపించింది, జనసేనకి ఓటమి మిగిల్చింది. భీమవరంలో ఎక్కడ విన్నా ఇదే చర్చ జరుగుతోంది గడచిన ఐదేళ్ళుగా.

మరి, ఈసారెలా.? వైసీపీ ఈ సారి కూడా ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెడుతుంది. తామే గెలుస్తామని ధీమాగా చెబుతోంది కూడా.
మరి, జనసేన దగ్గర అధికార వైసీపీని ఎదుర్కొనే ఖచ్చితమైన వ్యూహం ఏమైనా వుందా.? సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానికుడు కాగా, గడచిన ఐదేళ్ళలో జనసేనాని భీమవరం వచ్చింది చాలా తక్కువసార్లే మరి.!