Janasenani PawanKalyan Caste Politics.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినా, దానికి కులాన్ని ఆపాదించడం రాజకీయ ప్రత్యర్థులకు సర్వసాధారణమైపోయింది.
అసలు రాజకీయాల్లో కులాల ప్రస్తావన లేకపోతే ఎలా.? రాజకీయం నడుస్తున్నదే ‘కులం’ కోణంలో.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది నిష్టుర సత్యం.
ఓ పార్టీ అధికారంలో వుంటే ఓ కులానికి.. ఇంకో పార్టీ అధికారంలో వుంటే ఇంకో కులానికి.. ఉన్నతాధికారుల దగ్గర్నుంచి, సలహాదారుల వరకు.. మంత్రుల దగ్గర్నుంచి పంచాయితీ సర్పంచుల వరకు.. అంతా ‘కులం’ చుట్టూనే నడుస్తుంది కథ.!
కుల జాడ్యమంటే.. అధికారంలోకి వచ్చాక.. సొంత కులానికి చెందినోళ్ళకి సలహాదారుల ముసుగేసి లక్షలు.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచి పెట్టడం.!
సొంత సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నిరుద్యోగులకి.. తాము అధికారంలో వున్నప్పుడు అప్పనంగా పదవులు కట్టబెట్టి.. ప్రజా ధనాన్ని వారి కోసం వెచ్చించడం కుల పిచ్చి.!
Mudra369
‘కులాల్ని కలిపే రాజకీయం..’ అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధికారానికి దూరంగా వున్న కులాలకి అధికారం.. అని పవన్ కళ్యాణ్ నినదిస్తున్నారు.
Janasenani PawanKalyan Caste Politics ఇదే అసలు సమస్య..
ఆ రెండు కులాలకు తప్ప, మరో కులానికి రాజ్యాధికారం దక్కకూడదన్నది ప్రధాన రాజకీయ పార్టీల పట్టుదల. లేకపోతే, ‘అన్ని కులాలకీ, రాజ్యాధికారంలో సమాన ప్రాధాన్యత..’ అన్న అంశాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నట్టు.?
మా పార్టీ హయాంలో.. మా తండ్రి హయాంలో.. అన్ని కులాలూ ఉద్ధరించబడ్డాయ్.. అని రాజకీయాల్లో చెప్పడం మామూలే. అదే నిజమైతే, ఇప్పటికీ కులాల్లో వెనుకబాటుతనం ఎందుకు వున్నట్టు.?

సంక్షేమ పథకాలు ఎన్నో దశాబ్దాలుగా పేదలకు అందుతున్నాయ్. పేదరికం పెరుగుతూనే వుంది తప్ప తగ్గడంలేదు. ఇది ఎవరి పాపం.?
మార్పు తప్పనిసరి..
మారాల్సింది జనమే.! జనసేన అధినేత ఆ మార్పు ఎలాగన్నది సూచిస్తారంతే. జనసేనకు జనం అండగా నిలబడితే, వచ్చేది జనం తాలూకు ప్రభుత్వమవుతుందన్నది జనసేన వాదన.!
Also Read: RRR Movie: జనం ‘ఛీ’ కొడుతున్నారు తమ్మారెడ్డీ.!
ఇక, జనసేన మీద ‘కులం’ పేరుతో విమర్శలు చేసేవారి కుల రాజకీయాలంటారా.? ప్రజలు తిరగబడితే.. ఏ కుల రాజకీయమైనా తోకముడవాల్సిందే.
చివరగా..
ఒకప్పుడు ‘కులం’ అనే ప్రస్తావన మీడియాలో వుండేది కాదు.! కానీ, ఆ మీడియానే ‘కుల గబ్బు’ పట్టిపోయి వుంది.
అందుకే, ‘సామాజిక వర్గం’ అనే రాత కాస్తా, ‘కులం’ పేరుతో నేరుగా రాతలు రాసే పరిస్థితి వచ్చేసింది.
Mudra369