Janhvi Kapoor NTR30 అరరె.! ఇంకోసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ విషయంలో ఫేక్ ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి బోనీ కపూర్ ధృవీకరించారు.
ఓ దక్షిణాది సినిమా కోసం జాన్వీ కపూర్ ‘సైన్’ చేసిందన్నది ఆ ‘పుకారు’ తాలూకు సారాంశం. సినిమా రంగం అన్నాక గాసిప్స్ మామూలే కదా.!
జూనియర్ ఎన్టీయార్ సినిమాలో జాన్వీ కపూర్ నటించబోతోందట..
‘జనగనమన’ సినిమా కోసం విజయ్ దేవరకొండ సరసన నటించబోతోన్న జాన్వీ కపూర్..
రామ్ చరణ్ కోసం జాన్వీ కపూర్‌ని తీసుకొస్తున్నారట..
ప్చ్.. ఇవన్నీ ఉత్త గాసిప్పులుగానే మిగిలిపోతున్నాయ్..
Mudra369
అదిగో జాన్వీ కపూర్ సౌత్ సినిమాల్లోకి వచ్చేస్తోంది.. ఇదిగో తెలుగులో ఫలానా హీరోతో జాన్వీ కపూర్ జత కడుతోంది.. అంటూ చాలాకాలంగా గాసిప్స్ వినిపిస్తూ వస్తున్నాయ్.!
Janhvi Kapoor NTR30 పరమ రొటీన్ ఖండన..
పుకార్లు రావడం, వాటిని జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ ఖండించడం పరమ రొటీన్ అయిపోయింది. అతిలోక సుందరి శ్రీదేవి జీవించి వుంటే, ఈపాటికి జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లో నటించేసేదే.!

ప్చ్.! దురదృష్టం. శ్రీదేవి అకాలమరణంతో అంతా మారిపోయింది. జాన్వీ కపూర్ ప్రస్తుతం కేవలం హిందీ సినిమాలకే పరిమితమైపోయింది. సౌత్‌లోకి అస్సలు రావడంలేదు.
ఓ తమిళ సినిమా కోసం జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించేందుకు సిద్ధమైందన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం. దాన్ని బోనీ కపూర్ ఖండించి పారేశారు.
ఎన్టీయార్ సినిమా సంగతేంటో.?
త్వరలో ఎన్టీయార్ – కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు ప్రచారంలో వుంది.
Also Read: సమంత క్షమాపణ.! విజయ్ దేవరకొండ సమాధానమిదీ.!
మరి, బోనీ కపూర్ ఖండనని ఎలా చూడాలా.? కేవలం తమిళ గాసిప్పుని ఆయన ఖండించారనుకోవాలా.? లేదంటే, ఆ ఖండన.. తెలుగు గాసిప్స్‌కి కూడా వర్తిస్తుందా.?
ఇదిలా వుంటే, జాన్వీ కపూర్ సినిమా ‘మిలి’ ఓటీటీలో సందడి చేస్తోంది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.