అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె చాలా డైనమిక్‌గా మారిపోయింది. డేరింగ్ అండ్ డాషింగ్ ఆటిట్యూడ్‌తో మంచి మంచి సినిమాలే చేసేస్తోంది. కెరీర్ బిగినింగ్ నుంచీ ప్రయోగాత్మక సినిమాలకు ‘జై’ కొడుతోన్న ఈ బ్యూటీ, పలు విజయాల్ని కూడా నమోదు చేసింది. అయితే, ఈ బ్యూటీకి ఓ భయం (Janhvi Kapoor Scary About Horror Films) వుందట.
చాలామందికి చాలా భయాలుంటాయి. నాక్కూడా అలాంటి ఓ భయం వుంది. అదే దెయ్యం.. అని చెప్పింది జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో.
Also Read: రూహీ.. జాన్వీ కపూర్ ఛీజ్ కేక్ ముచ్చట
అదేంటీ, ఈ రోజుల్లో దెయ్యాలంటే భయపడేవారుంటారా? అని ప్రశ్నిస్తే, దెయ్యాలుంటాయని కాదుగానీ.. అంటూ అసలు విషయం చెప్పేసింది.
దెయ్యాలు లేవని తనకూ తెలుసంటున్న జాన్వీ కపూర్, దెయ్యాల సినిమాలు చూస్తే, ఆ ఎఫెక్ట్స్ వల్ల భయం కలుగుతుందని వివరించింది. మరి, ప్రేక్షలు కూడా ఆ భయం ఫీలవుతారు కదా, అలాంటి సినిమాలు చెయ్యడం మానేస్తావా.? అనడిగితే, అదేం లేదని సమాధానమిచ్చింది ఈ బ్యూటీ.
భయం కూడా థియేటర్లకు ప్రేక్షకుల్ని బాగానే రప్పిస్తుంది. తెరపై కనిపించే భయాన్ని ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు.. అన్నది జాన్వీ కపూర్ ఉవాచ. భయం సంగతి పక్కన పెడితే, గ్లామరస్ రోల్స్ చేయడం తనకు ఇష్టమనీ, అదే సమయంలో ప్రయోగాత్మక సినిమాలకే తొలి ప్రాధాన్యత అనీ జాన్వీ (Janhvi Kapoor Scary About Horror Films) చెప్పుకొచ్చింది.
గ్లామర్ అంటే ఎక్స్‌పోజింగ్ మాత్రమే కాదట. గ్లామర్ అంటే, అందంగా కనిపించడమని చెబుతూ, అలా అందంగా కనిపించే క్రమంలో స్విమ్ సూట్, శారీస్, షార్ట్ డ్రస్సులు.. ఇవన్నీ మామూలేనని అభిప్రాయపడింది జాన్వీ కపూర్.