Jogi Ramesh Arrest.. కులం ముసుగేసుకుని, ఓ నేరస్తుడు తప్పించుకోవడానికి అవకాశం వుంటుందా.?
ఫలానా సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి, అతనెంతటి నేరానికి పాల్పడినా శిక్షించకూడదా.?
ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయం ఎందుకింతలా దిగజారిపోతోంది.? ఏదన్నా కేసులో, రాజకీయ నాయకులు అరెస్టయితే.. ముందుగా కుల ప్రస్తావన ఎందుకు వస్తోంది.?
సోషల్ మీడియాలో ఎవరో ఏదో వాగితే.. అది వేరే లెక్క.! కానీ, రాజకీయంగా ఉన్నత స్థానాల్ని చూసిన నాయకులే, కులం ముసుగులో దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దారుణం.
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టయ్యారు. అప్పట్లో చంద్రబాబుని దూషించారు, పవన్ కళ్యాణ్‌ని దూషించారు.. చాలా కేసులున్నాయి జోగి రమేష్ మీద.
నేరస్తుడో కాదో నిర్ధారించాల్సింది న్యాయస్థానం..
లిక్కర్ కేసులో జోగి రమేష్ మీద తీవ్రమైన అభియోగాలే వున్నాయి. ఈ క్రమంలోనే, జోగి రమేష్‌ని అరెస్ట్ చేశారు. రోగి రమేష్ నేరస్తుడా.? కాదా.? అన్నది న్యాయస్థానం నిర్ధారిస్తుంది.
చట్టం తన పని తాను చేసుకుపోవాలి.! కానీ, విషయాన్ని పక్కదారి పట్టించేందుకు, ‘కుల రాజకీయాలు’ తెరపైకొస్తున్నాయ్.
‘బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు.?’ అంటూ వైసీపీ నాయకులు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
వైసీపీ హయాంలో, ఎంతమంది బీసీ, ఎస్సీ ఎస్టీ నాయకులు అరెస్టయ్యారో ఓసారి వైసీపీ అధినాయకత్వం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా.?
చంద్రబాబు ఇంటి మీదకు దాడికి వెళ్ళారు అప్పట్లో జోగి రమేష్. ‘వినతి పత్రం ఇచ్చేందుకు’ అంటూ, ఆ తర్వాత బుకాయించారనుకోండి.. అది వేరే సంగతి.
Also Read: సన్ గ్లాసెస్ వాడుతున్నారా? మీరివి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
జోగి రమేష్ అనుచరులు, కర్రలు ఇతర మారణాయుధాలతో ఆయన వెంట, చంద్రబాబు ఇంటి మీద దాడికి యత్నించడం అప్పట్లో పెద్ద సంచలనం.
ఇక, వైఎస్ జగన్ సమక్షంలో జోగి రమేష్, పవన్ కళ్యాణ్ మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు.
మరోపక్క, అధికారంలో వున్నప్పుడు, అధికారులపైనా దురుసుతనం ప్రదర్శించారు జోగి రమేష్. చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా చాలా పెద్దదే.!
జోగి రమేష్ అరెస్టయ్యారు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయ నాయకులు జైళ్ళకు వెళ్ళడం కొత్త కాదు. బెయిల్ తెచ్చుకోవడం వాళ్ళకి కష్టమూ కాదు.
ఈలోగా, కులం పేరుతో అలజడి సృష్టించే ప్రయత్నమే అత్యంత అభ్యంతరకరం.!
