Table of Contents
Jr NTR CBN Headache.. సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్‌కి రాజకీయాలతో సంబంధమేంటి.?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయితే, జూనియర్ ఎన్టీయార్ ఎందుకు స్పందించాలి.?
సంబంధం వుంది.! లేదని ఎలా అనగలం.? ఇదే చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలంటూ 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఊరూ వాడా తిరిగాడు జూనియర్ ఎన్టీయార్.!
కానీ, జూనియర్ ఎన్టీయార్‌కి టీడీపీ నుంచి ఒరిగిందేంటి.? ఛీత్కారం.! ఔను, టీడీపీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీయార్‌ని దూరం పెట్టింది. పార్టీ దరిదాపుల్లోకి కూడా రానీయలేదు.!
Jr NTR CBN Headache.. ఎన్టీయార్ ముందున్న అవకాశాలేంటి.?
చిరంజీవిలా సినిమాలు మానేసి, జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాలా.? పవన్ కళ్యాణ్‌లా ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు రాజకీయాలు.. ఇలా రెండు పడవల ప్రయాణం చెయ్యాలా.?
జూనియర్ ఎన్టీయార్ ముందున్న ఆప్షన్స్ ఏంటన్నదానిపై మీడియా, సినీ, రాజకీయ వర్గాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయాల్లోకి రావాలా.? వద్దా.? అన్నది జూనియర్ ఎన్టీయార్ వ్యక్తిగత నిర్ణయం. సినీ నటుడిగా తిరుగులేని స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్.!
స్పందించాలా.? వద్దా.?
నారా చంద్రబాబునాయుడు.. అంటే, జూనియర్ ఎన్టీయార్‌కి బంధువే కదా.! మేనత్త భువనేశ్వరి భర్త.! సో, చంద్రబాబునాయుడి అరెస్టుపై జూనియర్ ఎన్టీయార్ స్పందించొచ్చు.!
కానీ, స్పందిస్తాడా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్. స్పందించలేదంటూ తెలుగు తమ్ముళ్ళు, జూనియర్ ఎన్టీయార్ మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇంతకీ, ఈ ‘చంద్ర’మామ తలనొప్పి నుంచి జూనియర్ ఎన్టీయార్ ఎలా బయటడపతాడు.? వేచి చూడాల్సిందే.!
బాలయ్య వున్నాడుగా.! జూనియర్ ఎన్టీయార్ ఎందుకు.?
టీడీపీకి నందమూరి బాలకృష్ణ వున్నాడు కదా.? హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు కదా.?
Also Read: షారుఖ్ ‘జవాన్’కి మహేష్ ‘బ్లాక్‌బస్టర్’ రివ్యూ.!
బాలయ్య వున్నప్పుడు జూనియర్ ఎన్టీయార్‌తో పనేంటి.? బాలయ్య రోడ్డెక్కి ఆందోళనలు చేయకుండా, జూనియర్ ఎన్టీయార్ స్పందించాలంటూ తెలుగు తమ్ముళ్ళు యాగీ చేయడమేంటి.?

ఏనాడన్నా చంద్రబాబు కారణంగా, జూనియర్ ఎన్టీయార్‌కి లబ్ది చేకూరిందా.? అన్న ప్రశ్నలు సహజంగానే తెరపైకొస్తాయ్.!
జూనియర్ ఎన్టీయార్ సినిమాలు చూడొద్దంటూ బాలయ్య అభిమానుల పేరుతో గతంలో చాలా వ్యవహారాలు నడిచాయ్.! ఇప్పుడూ అదే జరుగుతోందా.?
బావ కళ్ళల్లో ఆనందం కోసం.. జూనియర్ ఎన్టీయార్ మీద బాలయ్య ఈ తరహా రాజకీయం ప్రయోగిస్తున్నాడా.? ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.!