Jr NTR Double Dhamaka.. యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో తెలియని అయోమయం అభిమానుల్ని వెంటాడుతోంది.!
పాన్ ఇండియా హీరో మాత్రమే కాదు.. గ్లోబల్ స్టార్ అనిపించేసుకున్నా, యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళకపోవడంతో అభిమానులు ఆందోళన చెందడం సబబే.
కానీ, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా ఇంకా మీనమేషాల్లెక్కుడుతోంది.. సెట్స్ మీదకు వెళ్ళడంలేదు.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?
ఆలస్యం.. అమృతమేనా.?
కొరటాల శివ గత సినిమా ‘ఆచార్య’ దారుణంగా బాక్సాఫీస్ వద్ద ఫెయిలవడమే ఈ ఆలస్యానికి కారణం. అన్ని జాగ్రత్తలూ తీసుకుని, ఎన్టీయార్ సినిమాని కొరటాల తెరకెక్కించాల్సి వుంది.

ఈ క్రమంలోనే కాస్త ఆలస్యమవుతోంది. సమయం తీసుకున్నా.. యంగ్ టైగర్ అభిమానులకి మాంఛి కిక్ ఇచ్చే గ్లోబల్ ఫిలిం చేయాలన్నది కొరటాల ఆలోచనగా కనిపిస్తోంది.
కొరటాల శివ సినిమా షూటింగ్ ప్రారంభమైతే.. ఆ తర్వాత లైన్లో ఇంకో సినిమాని తీసుకొచ్చేస్తాడు యంగ్ టైగర్ ఎన్టీయార్. అదే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా.
Jr NTR Double Dhamaka.. ఈ ఏడాదే రెండూ..
వచ్చే నెలలో.. అంటే మార్చిలో ‘కొరటాల శివ – ఎన్టీయార్’ కాంబినేషన్‌లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ నెలాఖరుకే.. లాంఛనంగా ప్రారంభమని కూడా అంటున్నారు.
మరోపక్క, ఆగస్ట్ – అక్టోబర్ మధ్య ప్రశాంత్ నీల్ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్ళిపోతుందని సమాచారమ్. ఈలోగా ‘సలార్’ సినిమాని ఓ కొలిక్కి తెచ్చేస్తాడట ప్రశాంత్ నీల్.
Also Read: Kiara Advani పెళ్ళంట.! ఆ సంగతి తెలుసా ఆమెకి.?
సో, ఈ ఏడాది రెండు ప్రాజెక్టులతో యంగ్ టైగర్ ఎన్టీయార్ బిజీ అవుతాడన్నమాట. అయితే, ఒక్క సినిమా కూడా ఈ ఏడాది ఎన్టీయార్ నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. అది అభిమానులకి కొంత నిరాశే కావొచ్చు.
అయితేనేం, రెండు ప్రతిష్టాత్మక సినిమాలూ 2024లో విడుదలైతే.. అంతకన్నా పవర్ కిక్ అభిమానులకు ఇంకేముంటుంది.?