Jr NTR Vijayasai Reddy రాజకీయానికి అనర్హం.! ఔను, అగ్గిపుల్లా.. సబ్బు బిళ్ళా.. కాదేదీ కవితకనర్హం.. అని ఓ మహా కవి చెబితే.. కాదేదీ రాజకీయానికి అనర్హమని రాజకీయ నాయకులు చెబుతున్నారు.
అక్కడ సందర్భమేంటి.? జరుగుతున్న రాజకీయమేంటి.? సినీ నటుడు తారకరత్న ఇటీవల గుండె పోటుకు గురికాగా, 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి.. నిన్న తుది శ్వాస విడిచాడు.
తారకరత్న పార్దీవ దేహం హైద్రాబాద్‌కి తరలించబడింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న పార్దీవ దేహానికి నివాళులర్పిస్తున్నారు.
Jr NTR Vijayasai Reddy.. సోదరుడి మృతి.. కన్నీరుమున్నీరైన ఎన్టీయార్..
సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్ తన సోదరుడు తారకరత్న మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
మరో సోదరుడు కళ్యాణ్ రామ్‌తో కలిసి తారకరత్న పార్దీవ దేహానికి జూనియర్ ఎన్టీయార్ నివాళులర్పించారు.
మరోపక్క, వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా తారకరత్న పార్దీవ దేహానికి నివాళులర్పించారు. అక్కడే వున్న జూనియర్ ఎన్టీయార్‌తో మాట్లాడారు.
Also Read: గురూజీ త్రివిక్రమ్ ‘మోసం’పై భక్తుడు ‘బండ్ల’ గణేష్ ట్వీటాస్త్రం!
తారకరత్న భార్య అలేఖ్యకి విజయసాయిరెడ్డి సమీప బంధువు. అదీ అసలు విషయం. ఎన్టీయార్‌తో విజయసాయిరెడ్డి మాట్లాడితే అందులో రాజకీయమేముంటుంది.?
రాజకీయం అంటేనే అంత.! వైసీపీ వైపు ఎన్టీయార్ వెళ్ళబోతున్నాడంటూ ఓ ప్రచారం. కాదు కాదు, టీడీపీతో విజయసాయిరెడ్డి లాలూచీ.. అని మరో ప్రచారం.!
అందుకే మరి.. కాదేదీ రాజకీయానికి అనర్హం అనేది.!