JrNTR Fans Warns Pawakalyan ఇదెక్కడి పంచాయితీ.? రామ్ చరణ్‌కి అభినందనలు తెలిపే క్రమంలో రాజమౌళి పేరు ప్రస్తావించి, ఆ ప్రెస్‌నోట్‌లో ఎన్టీయార్ పేరుని ఇగ్నోర్ చేయడమేంటి.?
యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) అభిమానులు ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు.
‘ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ సంగతేంటో చూస్తాం..’ అంటూ హెచ్చరిస్తున్నరు యంగ్ టైగర్ ఎన్టీయార్ (Jr NTR) అభిమానుల పేరుతో కొందరు.
అక్కడికేదో, 2019 ఎన్నికల్లో యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు గంప గుత్తగా జనసేన పార్టీకి ఓట్లేసేసి గెలిపించేసినట్లుంది వ్యవహారం.!
JrNTR Fans Warns Pawakalyan.. సినిమాలకీ.. రాజకీయాలకీ లింకేంటి.?
అంతర్జాతీయ వేదికపై అవార్డ్ ప్రెజెంటర్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) అరుదైన గౌరవం దక్కించుకున్నాడు.
ఈ క్రమంలోనే బాబాయ్‌గా పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), తన అన్న కొడుకు రామ్ చరణ్‌కి (Global Star Ramcharan) అభినందనలు తెలిపారు.

ఇందులో వింతేముంది.? రాజమౌళి (SS Rajamouli) కూడా ఆ వేదికపై కనిపించాడు గనుక.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆయనే దర్శకుడు గనుక.. రాజమౌళి పేరుని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తావించారు.
సరే, జూనియర్ ఎన్టీయార్‌ని కూడా ప్రత్యేకంగా వపన్ కళ్యాణ్ ప్రస్తావించి వుంటే బావుండేదన్నది వేరే చర్చ. ‘ఆర్ఆర్ఆర్’ బృందం అని పేర్కొన్నారు కదా, ప్రెస్ నెట్‌లో.?
అయితే, ఓట్లెయ్యరన్నమాట..
టీడీపీని కాదని, యంగ్ టైగర్ ఎన్టీయార్ (Man Of Masses NTR) అభిమానులు జనసేన పార్టీకి ఓట్లేస్తారా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. రాజకీయాలు వేరు.. సినిమాలు వేరని అనుకోవడానికి లేదు.
సినిమానే రాజకీయం.. రాజకీయమే సినిమా.. అయిపోయింది. నిజానికి, పవన్ కళ్యాణ్ – జూనియర్ ఎన్టీయార్ మధ్య అత్యంత సన్నహిత సంబంధాలున్నాయ్.
Also Read: ఇదీ రామ్ చరణ్ విక్టరీ.! లెంపలేసుకో యండమూరీ.!
కానీ, అభిమానులున్నారే.. ఓ పట్టాన వాస్తవాన్ని అంగీకరించలేరు. హీరోలకు లేని ఇగోలు, అభిమానులకెందుకో.? అదో జాడ్యం.! ఇది అందరు హీరోల అభిమానులకీ వర్తిస్తుంది.
రామ్ చరణ్, ఎన్టీయార్ కలిసి నటించారు.. కొందరు ‘అభిమానం’ ముసుగులో కుళ్ళుకున్నారు. కానీ, సినిమా పెద్ద విజయం సాధించింది. ఇద్దరూ గ్లోబల్ స్టార్స్‌గా గుర్తంపు తెచ్చుకున్నారు.
రేప్పొద్దున్న పవన్ కళ్యాణ్ – జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) కాంబినేషన్‌లో సినిమా ప్రకటితమైతే సోకాల్డ్ అభిమానులు ఏమైపోతారో.?