JrNTR Hrithik Roshan War2.. హృతిక్ రోషన్ అంటే, పవర్ హౌస్.! ఆ డాన్సులు, ఆ యాక్షన్.. వేరే లెవల్.! జూనియర్ ఎన్టీయార్ ఏమైనా తక్కువా.?
జూనియర్ ఎన్టీయార్‌తో పని చేసిన ప్రతి దర్శకుడూ, అతని ‘వేగం, ఎనర్జీ’ గురించే ప్రత్యేకంగా మాట్లాడుతుంటారు. దటీజ్ జూనియర్ ఎన్టీయార్.
బాలీవుడ్‌లో ‘వార్-2’ సినిమాలో నటిస్తున్నాడు జూనియర్ ఎన్టీయార్. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ఇది. దీన్ని మల్టీస్టారర్‌గా చెప్పొచ్చు.
JrNTR Hrithik Roshan War2.. హ్యాపీ బర్త్ డే జూనియర్ ఎన్టీయార్..
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీయార్ పుట్టినరోజు నేపథ్యంలో ‘వార్-2’ టీమ్, ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ ప్రోమో విడుదల చేసింది.
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీయార్ పోటా పోటీగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో అదరగొట్టేసినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
ఈ ఇద్దరికీ ధీటుగా, బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీ (Kiara Advani), బికినీతో షాక్ ఇచ్చింది.
ఇదంతా నాణేనికి ఓ వైపు. ఇంకో వైపు, ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది. జూనియర్ ఎన్టీయార్‌ని అటు హృతిక్ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
Also Read: ఓ శ్రీరెడ్డి.. ఓ శ్యామల.! అంతేగా.? తేడా ఏమైనా వుందా.?
ఇటు, తెలుగు సినిమాకి సంబంధించి.. ఓ వర్గం సినీ అభిమానులు, జూనియర్ ఎన్టీయార్‌ని అత్యంత దారుణంగా ట్రోల్ చేస్తుండడం గమనార్హం.
నిజానికి, జూనియర్ ఎన్టీయార్ ప్రతి సినిమా విషయంలోనూ, ఈ ట్రోలింగ్‌ని ఎదుర్కోవడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది.
‘దేవర’ సినిమా విషయంలో ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు అంతకు మించి ట్రోలింగ్ జరుగుతోంది. ట్రోలింగ్ చేస్తున్నది, వేరే హీరోల అభిమానులైతే అది వేరే చర్చ.
నందమూరి అభిమానుల్లోనే ఓ వర్గం, జూనియర్ ఎన్టీయార్‌ని (Jr NTR) ట్రోల్ చేస్తుండడం గమనార్హం.
చూస్తోంటే, ఇంట గెలిచి రచ్చ గెలవడం.. అని కాకుండా, రచ్చ గెలిచినా, ఇంట గెలవలేకపోవడం.. అనే ప్రస్తావన కరెక్టేమో అనిపిస్తోంది.