JrNTR Insults SrNTR యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎందుకు తన తాత స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాల వేడుకలో పాల్గొనలేదు.?
ఒక్కటే ప్రశ్న.! దానికి ఎన్ని కుంటి సాకులైనా చెప్పొచ్చుగాక.! కానీ, తాతకు తగిన గౌరవాన్ని మనవడు జూనియర్ ఎన్టీయార్ ఇవ్వలేకపోయాడన్నది మాత్రం నిర్వివాదాంశం.!
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
JrNTR Insults SrNTR.. జూనియర్ ఎందుకు హాజరు కాలేదంటే..
పుట్టినరోజు నేపథ్యంలో ముందుగానే కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేసేసుకోవడం వల్ల, జూనియర్ ఎన్టీయార్ తన తాత శత జయంతి వేడుకల్లో పాల్గొనలేకపోయాడట.!
ఏమో, జూనియర్ ఎన్టీయార్‌కి ఏమేం వ్యాపకాలున్నాయో.! కానీ, అవేవీ తాత కంటే ఎక్కువ కాదు కదా.?

పనిగట్టుకుని, జూనియర్ ఎన్టీయార్ పుట్టినరోజునాడే ఆ కార్యక్రమాన్ని నిర్వహించారంటే, అందులో ఏదో కుట్ర వుందంటూ ‘బుడ్డోడి’ అభిమానులు గుస్సా అవుతున్నారు.
కారణం ఏదైనాగానీ..
ముందే చెప్పుకున్నట్లు.. ఎన్ని కారణాలైనా చూపించొచ్చు.. కానీ, అవన్నీ కుంటి సాకులే అవుతాయి.!
నందమూరి తారక రామారావు.. ఆ పేరు పెట్టుకున్నాక, ‘జూనియర్’ ఎట్టి పరిస్థితుల్లోనూ, తాత విషయమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
‘నువ్వసలు నందమూరి వారసుడివే కాదు..’ అని చాలామంది స్వర్గీయ ఎన్టీయార్ అభిమానులు, ‘బుడ్డోడి’పై మండిపడుతున్న పరిస్థితి ఎందుకొచ్చింది.?
ముందు ముందు ఎన్టీయార్ ఈ విషయమై ఎంత వివరణ ఇచ్చుకున్నాగానీ, ‘ఎన్టీవోడి మనవడు మొహం చాటేశాడు’ అన్న మచ్చని చెరిపేసుకోవడం కష్టం.!
ఒక ఆడియో సందేశం.. కనీసం ఓ వీడియో సందేశం.! తాత స్వర్గీయ ఎన్టీయార్‌ని కీర్తిస్తూ అభిమానుల్ని అలరించేందుకు యంగ్ టైగర్ ఎన్టీయార్ కనీసం ప్రయత్నించకపోవడం ఆశ్చర్యకరం.
నిజానికి, తాత పట్ల అమితమైన ప్రేమాభిమానాలు, భక్తి గౌరవాలూ ప్రదర్శించే జూనియర్ ఎన్టీయార్ ఎందుకిలా చేసినట్లు.?
ఏమో, తెరవెనుకాల ఏం జరిగిందో.! అదైతే ఎవరికీ అనవసరం. ముఖ్యమైన, అతి ముఖ్యమైన వేదికపై, మనవడిగా వుండాల్సిన జూనియర్ ఎన్టీయార్, వుండలేకపోయాడంతే.!