Jyoti Poorvaj Killer Jagathi.. ఆమె పేరు జయశ్రీ రాయ్.! తెలుగు బుల్లితెరపై ‘జగతి’గా అలరించింది. ఇప్పుడామె జ్యోతి పూర్వజ్ పేరుతో వెండితెరపై సందడి చేయబోతోంది.!
బుల్లితెర నుంచి వెండితెరపై నటీనటులు ఎదగడం కొత్త విషయమేమీ కాదు. కొందరు బుల్లి తెర నుంచి వెండితెరపై స్టార్లుగా ఎదిగారు కూడా.
బాలీవుడ్ నటి మౌనీ రాయ్ కూడా, ‘నాగిని’ అనే హిందీ టీవీ సీరియల్ ద్వారా పాపులర్ అయి, ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

టీవీ యాంకర్, న్యూస్ ప్రెజెంటర్గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్, వెండితెరపై ఇప్పుడు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.
ఏమో, జ్యోతి పూర్వజ్ కూడా ఆ స్థాయి స్టార్డమ్ అందుకుంటుందేమో.! ‘కిల్లర్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది జయశ్రీ రాయ్ అలియాస్ జగతి అలియాస్ జ్యోతి పూర్వజ్.
Jyoti Poorvaj Killer Jagathi.. పేరులో ఏముంది.?
బుల్లితెర వీక్షకులకి, స్క్రీన్ నేమ్స్ మాత్రమే గుర్తుంటాయి.. నటీనటులకు సంబంధించి. అలా, ‘జగతి మేడమ్’ పేరు స్థిరపడిపోయింది బుల్లితెర వీక్షకుల్లో.
‘గుప్పెడంత మనసు’ పేరుతో రూపొందిన ఓ టీవీ సీరియల్లో ‘జగతి’ పాత్రలో కనిపించింది జ్యోతి పూర్వజ్. అప్పట్లో ఆ సీరియల్ పెద్ద హిట్.

బుల్లితెరపై చాలా పద్ధతిగా కనిపించిన జ్యోతి పూర్వజ్ (Jyoti Poorvaj), వెండితెరపై మాత్రం, అందాల విందుకు సిద్ధమైపోయింది.
నలభైల్లోకి అడుగు పెట్టేసిన జ్యోతి పూర్వజ్ (Jyoti Poorvaj) గ్లామర్, యంగ్ జనరేషన్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవడంలేదు.
Also Read: Vaibhav Suryavanshi చిన్నోడు.. చిచ్చర పిడుగు! చితక్కొట్టేశాడు!
‘కిల్లర్’ సినిమా కోసం జ్యోతి పూర్వజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేసేసింది. ‘కిల్లర్’ సినిమాకి పబ్లిసిటీ పరంగా చూసుకుంటే జగతి అలియాస్ జయశ్రీ రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ‘కిల్లర్’ సినిమా ఒకింత రిచ్గానే కనిపిస్తోంది.. ప్రోమోస్ని చూస్తోంటేనే ఆ విషయం అర్థమవుతోంది.