కాజల్ అగర్వాల్ పెళ్ళయ్యాక కెరీర్ పరంగా దూకుడు పెంచింది. ఓ పక్క బిజినెస్ ప్లాన్స్, ఇంకోపక్క వరుస సినిమాలు.. వెరసి కాజల్ అగర్వాల్ (Kajal Agarwal Hot Action Image) ఈ కొత్త ఫేజ్ చాలా చాలా హ్యపీగా వుందంటూ తాజాగా ఓ ఇంటవ్వూలో చెప్పుకొచ్చింది.
కాజల్ ‘మోసగాళ్ళు’ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాలో తనది చాలా చాలా కొత్తదనంతో కూడుకున్న పాత్ర అనేది కాజల్ చెబుతున్నమాట.
ఇదిలా వుంటే, కాజల్ అగర్వాల్ తెలుగులో మరో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. వాటిల్లో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’. కాగా, ఇంకొకటి నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న సినిమా. ‘నా తదుపరి సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నా..’ అంటూ కాజల్ అగర్వాల్, నాగార్జునతో చేయబోయే సినిమా గురించి వెల్లడించింది.
ఇకపై కొత్తదనంతో తెరకెక్కే సినిమాలే చేయాలనుకుంటున్నానని కాజల్ వెల్లడించింది. ‘గ్లామరస్ రోల్స్ చేయనని కాదు. కానీ, కెరీర్‌లో ఇప్పటికే చాలా సినిమాలు చేసిన నేను, ఇక నుంచి ప్రయోగాత్మక సినిమాలు ఎక్కువగా చేయాలనుకుంటున్నాను’ అని వెల్లడించింది.
కరోనా పాండమిక్ తన ఆలోచనల్ని మార్చేసిందనీ, జీవితం గురించి చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని ఓ ప్రశ్నకు బదులిచ్చింది కాజల్ (Kajal Agarwal Hot Action Image).
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు వరుసగా చేస్తున్నాననీ, సుదీర్ఘ కాలం సినీ రంగంలో రాణిస్తుండడం చాలా ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించింది అందాల చందమామ కాజల్ అగర్వాల్.
త్వరలో చేయబోయే సినిమా కోసం కాజల్ అగర్వాల్ స్టంట్స్‌లో శిక్షణ కూడా తీసుకుంటోందట.