కాజల్ అగర్వాల్ పెళ్ళి కబురు (Kajal Agarwal Wedding) చెప్పింది. గౌతవ్‌ు కిచ్లూ అనే పారిశ్రామికవేత్తను పెళ్ళాడబోతోంది కాజల్ అగర్వాల్. ఈ విషయమై కొద్ది నెలలుగా చాలా గాసిప్స్ వినిపించినా, కాజల్ మాత్రం కాస్త లేటుగా స్పందించింది.
కొన్నాళ్ళ క్రితం ‘కాజల్ పెళ్ళి డిసెంబర్‌లో..’ అంటూ ఊహాగానాలు విన్పిస్తే, ‘అబ్బే, ప్రస్తుతానికి ఆ ఉద్దేశ్యం లేదు’ అని చెప్పింది కాజల్. అనూహ్యంగా ఇప్పుడు తన పెళ్ళి కబురుని తానే స్వయంగా వెల్లడించింది. అక్టోబర్ 30న కాజల్ పెళ్ళి జరగనుంది.
ఇదిలా వుంటే, కాజల్ అగర్వాల్ పెళ్ళయ్యాక సినిమాల్లో నటిస్తుందా.? లేదా.? అన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే వున్నాయి. కాజల్ నటించిన ‘మోసగాళ్ళు’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం విదితమే.
మంచు విష్ణు నిర్మిస్తోన్న సినిమా అది. కాజల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా, విష్ణు మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక, మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ రూపొందిస్తోన్న ‘ఆచార్య’ సినిమా కోసం తొలుత త్రిషని అనుకున్నా, ఆ తర్వాత ఆ ప్లేస్‌లోకి కాజల్ వచ్చి చేరింది.
మరోపక్క తమిళంలో ‘భారతీయుడు-2’లో నటిస్తోంది కాజల్. వీటితోపాటు తెలుగు, తమిళ భాషల్లో మరికొన్ని సినిమాల్లో కాజల్ నటించాల్సి వుంది. హిందీలోనూ రెండు ప్రాజెక్టులకు కాజల్ సైన్ చేసింది. అవన్నీ పూర్తి చేయాలంటే చాలా సమయమే పడుతుంది.
సో, కాజల్ ఇప్పట్లో నటనకు గుడ్ బై చెప్పే అవకాశమే లేదన్నమాట. పెళ్ళయ్యాక కూడా తాను సినిమాల్లో నటిస్తూనే వుంటానని కొన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కాజల్ అగర్వాల్.. (Kajal Agarwal Wedding) బహుశా పెళ్ళయ్యాక తన కెరీర్‌లో మరింత జోరు పెంచుతుందేమో.!
బాలీవుడ్ హీరోయిన్లకు ఇది సర్వసాధారణమైన విషయం. తెలుగులో సమంత కూడా పెళ్ళయ్యాక జోరు పెంచిన విషయం విదితమే.