Kajal Aggarwal.. అదిగో కాజల్ తల్లి కాబోతోందట. ఇదిగో చందమామ ప్రెగ్నెంట్ అట.. అందుకే బంపర్ ఆఫర్స్ అన్నీ వదిలేసుకుంటోందట.. అంటూ కాజల్ ప్రెగ్నెన్సీ విషయమై ఆ మధ్య చాలా చాలా రూమర్లు చక్కర్లు కొట్టాయ్. కొన్ని రోజులు అలా మీడియా అటెన్షన్‌ని క్యాచ్ చేసిన చందమామ వన్ ఫైన్ డే ఆ రూమర్స్‌కి చెక్ పెట్టేసింది.
నూతన సంవత్సరం సందర్భంగా కాజల్ (Kajal Agarwal) తీపి కబురు చెప్పేసింది. ‘అవును నేను తల్లిని కాబోతున్నాను. 2022 సంవత్సరంలో నా భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి మా మొదటి బిడ్డ జననం కోసం ఎదురు చూస్తున్నాను..’ అంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది అందాల చందమామ కాజల్ అగర్వాల్.
ఇక, ఆ తర్వాత కాజల్ అగర్వాల్ పెద్దగా సోదిలో లేదు. కానీ, లేటెస్టుగా కాజల్ మళ్లీ మీడియా అటెన్షన్‌ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. రీసెంట్‌గా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాజల్. ఆ ఫోటోల కారణంగా ఒకింత ఆకతాయి నెటిజన్ల ట్రోలింగ్‌కి గురైందట.
తనను ఎంతో మంది అభిమానిస్తున్నారనీ, కానీ, కొందరు ఆకతాయిలు తననూ, తన ఫిజిక్‌నూ ట్రోల్ చేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేసింది. కానీ కుంగిపోలేదు. ఆ ఆవేదనను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది కాజల్ అగర్వాల్.
కాజల్ కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం
ప్రెగ్నెన్సీ వల్ల తన జీవితంలో చాలా మార్పులొచ్చాయనీ, శరీరంలో, ఇంట్లో ఇలా చాలా మార్పులు చోటు చేసుకున్నాయనీ కాజల్ చెప్పుకొచ్చింది. అలాగే, అదనంగా కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తోందట.
నెట్టింట తన ఫోటోలతో కొందరు ఆకతాయిలు బాడీ షేమింగ్ చేస్తున్నారు.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది కాజల్. ఇతరుల పట్ల ప్రేమ పూర్వక ధోరణితో వుండాలని హితవు పలికింది.

జీవించండి. ఇతరుల్ని జీవించనివ్వండి.. అని కోరింది. ప్రెగ్నెన్సీ వల్ల బరువు పెరగడం జరుగుతుంది. హార్మోనల్ మార్పుల వల్ల పొట్టతో పాటు, ఛాతి భాగం కూడా పెరుగుతుంది. దీనివల్ల స్ట్రెచ్ మార్కులు కూడా వస్తాయ్. ఇవేమీ అసాధారణమైనవి కావు. చాలా చాలా సాధారణమైన విషయాలే. వీటి గురించి విమర్శలు చేయడం అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదని కాజల్ చెప్పుకొచ్చింది.
Kajal Aggarwal అమ్మతనాన్నిఆస్వాదిస్తున్న చందమామ
ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే కాదు, బిడ్డకు జన్మనిచ్చాక కూడా శరీరంలో మార్పులు రావచ్చు. తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి అది అసాధ్యం కూడా కావచ్చు. అయినా కానీ, దీన్ని ఒక అద్భుతమైన ఫేజ్‌గా నేను భావిస్తున్నాను.. అని చెప్పింది కాజల్.
Also Read: కీర్తి సురేష్ ఐరెన్ లెగ్గు స్టోరీ: ఊ! అంటారా.?
అలాగే, ఇదంతా ఓ కొత్త జీవిని భూమికి పరిచయం చేయడానికి నడిచే ఓ ప్రాసెస్. ప్రతి మహిళ జీవితంలోనూ ఇది జరిగేదే. నేనూ అలాంటి ఓ సాధారణ మహిళనే. ఓ బిడ్డకి జన్మనిచ్చేందుకు సిద్ధమవుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తున్నాను. లక్షలాదిమంది నన్ను అభిమానిస్తున్నారు. గౌరవిస్తున్నారు. కొందరు మాత్రమే ట్రోల్ చేస్తున్నారు. అది అర్ధ రహితం.
మళ్లీ చెబుతున్నా.. బతకండి.. బతకనివ్వండి.. అంటూ అమ్మతనంలో వుండే గొప్పతనాన్ని చక్కగా వివరించి చెప్పింది కాజల్. దీంతో కాజల్‌పై వున్న అభిమానం 100 రెట్లు పెరిగిందని ఆమె అభిమానులు పొంగిపోతున్నారు.
ట్రోల్ చేసేవాళ్లు ఎప్పుడూ ట్రోల్ చేస్తూనే వుంటారు. వారిని పట్టించుకోవద్దని తమ అభిమాన నటికి భరోసా ఇస్తున్నారు కాజల్ (Kajal Agarwal) ఫ్యాన్స్.