Kajol Devgn Lustu బాలీవుడ్ నటి కాజోల్ దేవగన్, ‘లస్ట్ స్టోరీస్ – 2’ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. సీజన్ వన్ బంపర్ హిట్. అందులో కైరా అద్వానీ తదితరులు నటించారు.
ఈసారి వ్యవహారం మరింత హాట్‌గా వుండబోతోంది. తమన్నా, మృనాల్ ఠాకూర్, కాజోల్ దేవగన్.. తదితరులు రెండో సీజన్‌లో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇంతకీ, ‘లస్ట్’ అంటే ఏంటి.. కాజోల్ దేవగన్ (Kajol Devgn) జీవితంలో అతి పెద్ద లస్ట్ ఏంటి.?
Kajol Devgn Lustu.. లస్టు.. కాజోల్ దేవగన్ లిస్టూ.!
ఎవరెవరో ‘లస్ట్’ గురించి ఏవేవో చెబుతుంటారనీ, కామం.. మోహం.. విపరీతమైన కాంక్ష.. ఇలాంటి అర్థాలు వింటుంటామనీ, అయితే అసలు ‘లస్ట్’ వేరే వుందన్నది కాజోల్ అభిప్రాయం.

కాజోల్ దేవగన్ దృష్టిలో లస్ట్ అంటే, గాఢమైన కోరిక అట.! ఏ విషయంలో అయినా గాఢమైన కోరిక వుంటే, దాన్నే లస్ట్ అని ఆమె అభివర్ణిస్తుందట.
ఇష్టమైన తిండి దగ్గర్నుంచి, డాన్స్్ చేయడం, మ్యూజిక్ వినడం.. వాట్ నాట్.. ఇలాంటివన్నీ ‘లస్ట్’లే.. అని కాజల్ అగర్వాత్ వెల్లడించింది.
అది కూడా లస్టేనట.!
కుట్లు.. అల్లికలు వంటి వ్యవహారాలే కాదట.. పిల్లతో కలిసి ప్రతి క్షణాన్నీ ఆస్వాదించడమూ లస్ట్ కేటగిరీలోకే వస్తుందని కాజల్ చెప్పడం గమనార్హం.

ఏంటో.. చేస్తున్న పనిని సమర్థించుకోవడానికి.. మరీ ఇలా వ్యవహరించాలా.? అన్నిటికీ ‘లస్ట్’ అనే పేరు పెట్టేయాలా.?
కాదేదీ పబ్లిసిటీకి అనర్హం.! అదీ అసలు సంగతి.