Table of Contents
Kamal Haasan Thuglife Kannada.. ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది.
చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా.. ‘పాన్ ఇండియా’ రిలీజ్ దిశగానే సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో, అన్ని భాషల ఆడియన్స్‌నీ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు.
Kamal Haasan Thuglife Kannada.. పాన్ ఇండియా హీరో కమల్ హాసన్..
ఇప్పుడంటే పాన్ ఇండియా.. అని మాట్లాడుకుంటున్నాంగానీ, కమల్ హాసన్ అంటే విశ్వ నటుడు.. అంటే, పాన్ ఇండియాకి మించి అన్నమాట.!
రేంజ్ ఎంత వుంటే ఏం లాభం.? ప్రతి సినిమాకీ ఏదో ఒక వివాదం వుండేలా చూసుకుంటున్నాడు కమల్ హాసన్.. అదే అసలు సమస్య.

తాజా పంచాయితీ, కన్నడ ప్రసలతో పెట్టుకున్నాడీ విశ్వ నటుడు.! అంతే, కన్నడలో ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్ ఆగిపోయింది. తమిళం నుంచి కన్నడ పుట్టిందని నోటికొచ్చింది వాగాడు కమల్.
నువ్వేమైనా చరిత్రకారుడివా కమల్.?
‘నువ్వేమైనా చరిత్రకారుడివా.?’ అని న్యాయస్థానమూ చీవాట్లు పెట్టింది. ‘కన్నడ ప్రజలకు క్షమాపణ’ చెప్పేందుకు కమల్ సుముఖత వ్యక్తం చేయలేదు.
తన సినిమాని కర్నాటకలో రిలీజ్ చేయడం లేదంటూ, ‘విశ్వనటుడు’ కమల్ హాసన్ (Kamal Haasan) సంచలన ప్రకటన చేశాడు.

చెరువు మీద ‘ముడ్డి’ అలిగితే, నష్టం ఎవరికి.? ముడ్డి కదా ఎండిపోయేది.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది కమల్ హాసన్‌కి వ్యతిరేకంగా.
ఓటీటీలోనూ బ్యాన్ చేస్తే.?
ఇప్పుడంతా ఓటీటీ యుగం నడుస్తోంది. కర్నాటకలో ‘థగ్ లైఫ్’ రిలీజ్ ఆపేసినా, ముందు ముందు ఓటీటీలో వస్తే, దాన్ని కన్నడ సినీ అభిమానులు చూసే అవకాశం వుంటుంది.
లేదూ, కమల్ హాసన్ సినిమాల్ని కన్నడిగులు బ్యాన్ చేయాలని ఫిక్సయితే, ఓటీటీలో కూడా చూడరు. దాని వల్ల నష్టపోయేది కమల్ హాసన్ మాత్రమే.
నటుడిగా స్థాయిని సంపాదించుకోవడం కంటే, వచ్చిన స్థాయిని నిలబెట్టుకోవడం ముఖ్యం. అహంకారం నెత్తికెక్కితే, కమల్ హాసన్ అవుతాడని ఇదిగో, ఈ ‘థగ్ లైఫ్’ కన్నడ గొడవతో నిరూపితమయ్యింది.
Also Read: యుద్ధ విమానాల తయారీ, కొనుగోలు.! ఏది ఎందుకు ఎలా మంచిది.?
అయినా, సున్నితమైన అంశం విషయంలో, కమల్ హాసన్ ఎందుకిలా ప్రవర్తించినట్లు.? తమిళనాడు – కర్నాటక మధ్యన కావేరీ జలాల వివాదం ఎప్పటినుంచో వుంది.
అది చాలక, ఇప్పుడు ఈ భాషల పంచాయితీని కమల్ తెరపైకి తెచ్చాడు. ఇదంతా రాజకీయ అవసరాల కోసమేనా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.