కంగనా రనౌత్ సొంత డబ్బా (Kangana Ranaut Compares Herself With Sridevi) పతాక స్థాయికి చేరిపోయింది. వినడానికి కర్ణ కఠోరంగా తయారైంది. నిజానికి కంగన మంచి నటి. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఆమె తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుంది. ఈ విషయంలోనూ ఎవరికీ అనుమానాల్లేవు.
కానీ, ‘శ్రీదేవి తర్వాత నేనే.. హాలీవుడ్ స్థాయి టాలెంట్ నాది..’ అని కంగనా రనౌత్ సొంత డబ్బా కొట్టుకుంటే ఎలా.? కంగనా రనౌత్ మానసిక స్థితిపై చాలామందికి కొత్త కొత్త అనుమానాలొస్తున్నాయంటే ఆమె వ్యవహార శైలి అలా తగలడింది మరి. తాను ఏ-గ్రేడ్ నటినని చెప్పుకుంటూ, ఇతర హీరోయిన్లను బి-గ్రేడ్‌లోకి నెట్టేస్తోంది కంగనా రనౌత్.
అయినా, తోటి నటీనటులకు ‘గ్రేడ్స్’ ఇచ్చే స్థాయి కంగనా రనౌత్‌కి వుందా.? ఛాన్సే లేదు. కానీ, ఇచ్చేస్తోంది. దీన్నే ‘అదేదో పెత్తనం’ అని కూడా అనొచ్చు. అయినా, కంగనా రనౌత్ (Kangana Ranaut Compares Herself With Sridevi) అలాంటి విమర్శల్ని పట్టించుకోదు. అలా పట్టించుకుంటే ఆమె కంగనా రనౌత్ ఎందుకు అవుతుంది.?
అయినా, వందలాది సినిమాల్లో నటించిన శ్రీదేవి ఎక్కడ.? ఎప్పుడూ వివాదాలతోనే పబ్లసిటీ స్టంట్లు చేసే కంగనా రనౌత్ (Kangana Ranaut Hot) ఎక్కడ.? శ్రీదేవి (Legend Sridevi) తన కెరీర్‌లో ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్ళలేదు. శ్రీదేవి చేసిన ప్రయోగాత్మక సినిమాల్లో పదో వంతు కూడా కంగన (Kangana Ranaut Controversy) చేసే ఛాన్సు లేదు.
వివాదాలతోనే తన పేరు ఎప్పుడూ వార్తల్లో వుంటుందని నమ్మే కంగనా రనౌత్‌ని, తన నటనతో.. తనదైన వ్యక్తిత్వంతో యావత్ భారత సినీ ప్రేక్షకుల్ని అలరించిన మహానటి శ్రీదేవి… ఆమె అతిలోక సుందరి. అలాంటి అతిలోక సుందరితో కంగనా రనౌత్‌ని పోల్చాల్సి (Kangana Ranaut Compares Herself With Sridevi) వస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
‘నన్ను చూసి కొందరు అనుకరిస్తున్నారు.. నా జట్టులా వాళ్ళు కూడా తమ జుట్టుని మార్చుకుంటున్నారు..’ అని చెప్పే కంగనా రనౌత్ (Kangana Ranaut Spicy) స్థాయికి బహుశా ఇంకే ఇతర నటీమణులూ దిగజారాలనుకోరేమో. అదీ కంగనా రనౌత్ స్థాయి.
కంగనా రనౌత్ మంచి మంచి సినిమాలు చేస్తుండొచ్చుగాక.. కానీ, ఏ సినిమా చేసినా, ఆ సినిమా ప్రమోషన్ కోసమో.. లేదంటే తన పేరు వార్తల్లో వుండడం కోసమో! కంగనా రనౌత్ చేసే పబ్లసిటీ స్టంట్లు.. గొప్ప సినిమాల ద్వారా ఆమె సాధించే ఘనతను (Kangana Ranaut Compares Herself With Sridevi) నాశనం చేస్తున్నాయన్నది నిర్వివాదాంశం.