బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut Political Plans), రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారుతోంది. వివిధ అంశాలపై కుండబద్దలుగొట్టేయడం ఆమెకి అలవాటే. అదే సమయంలో, ఎలాంటి వివాదాల జోలికి వెళితే ఎలాంటి పాపులారిటీ వస్తుందో కూడా ఆమెకు బాగా తెలుసు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ (Sushant Singh Rajput) మరణం, రియా చక్రవర్తిపై (Rhea Chakraborty) కేసు.. బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారాలు.. ఇలా చాలా అంశాలపై హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో వ్యక్తిగా మారిన కంగనా రనౌత్, మహారాష్ట్ర రాజకీయాలపై కన్నేసిందిప్పుడు. శివసేనపైనా, కాంగ్రెస్ పార్టీపైనా డైరెక్ట్‌గా విమర్శలతో విరుచుకుపడిపోతోంది.
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌కి బీజేపీ నుంచి మద్దతు లభిస్తోంది. ‘కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాకపోవచ్చు..’ అంటూ ఆమెను కలిసిన ఓ పొలిటికల్ లీడర్ అథవాలే వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, సినిమాల సంగతి పక్కన పెట్టి ఆమె రాజకీయాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటే, బీజేపీ అందుకు సిద్ధంగా వుంటుందనీ సదరు పొలిటికల్ లీడర్ అభిప్రాయపడ్డారు.
ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చిన కంగనా రనౌత్, రాజకీయాల్లో ఏ స్థాయి విమర్శలకైనా తాను సిద్ధమేనన్న సంకేతాలు పంపింది. తప్పో.. ఒప్పో.. రాజకీయాల్లో మాత్రం ఇలాంటోళ్ళకి క్రేజ్ బీభత్సంగానే వుంటోందన్నది నిర్వివాదాంశం.
ఒకవేళ కంగన (Kangana Ranaut Political Plans) రాజకీయాల్లోకి రావాలనుకుంటే, ఆమెకు పెద్దపెద్ద పదవులు వచ్చినా ఆశ్చర్యం లేదు. కంగనాకి వున్న గ్లామర్ అలాంటిది. సోషల్ మీడియాలో సపోర్టర్స్, హేటర్స్ సమానంగా వున్నా.. అదీ, ఇదీ.. ఆ రెండూ ఆమెకు రాజకీయంగా మరింత బలాన్నిచ్చేవే.
ఈ రోజుల్లో పాజిటివిటీ కంటే, నెగెటివిటీనే ఎక్కువ ఉపయోగపడ్తోంది వివాదాలతో సావాసం చేసేవాళ్ళకి. సో, కంగన కూడా ఈ విషయంలో ‘రారాజకీయం’ నడుపుతోందని అనుకోవచ్చేమో.