Kangana Slams Prakash Raj.. ఇద్దరూ సినీ నటులే.! ఒకరేమో విలక్షణ నటుడు.! ఇంకొకరేమో, విలక్షణ నటి.! స్టార్‌డమ్ విషయంలో ఎవరికి వారే.!
ఆ మాటకొస్తే, ఆమెకున్న స్టార్‌డమ్ చాలా చాలా ఎక్కువ. ఇద్దరూ నార్త్, సౌత్ సినిమాల్లో నటించారు. నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కూడా.
ఒకరు, బీజేపీ మద్దతుదారు.. ఇంకొకరేమో బీజేపీ అంటే అస్సలు గిట్టనివారు.! ఎవరా ఇద్దరు.? ఏమా కథ.?
Kangana Slams Prakash Raj.. హిందీ గొడవేంటి.?
బీజేపీని ఏదోలా విమర్శించేందుకు నానా తంటాలూ పడుతుంటారు ‘మేతావి’ ప్రకాష్ రాజ్.! తన పాండిత్యాన్నంతా, బీజేపీ మీద ప్రయోగిస్తుంటారాయన.
ప్రకాష్ రాజ్ (Prakash Raj) కూడా రాజకీయాలతో సంబంధాలు కలిగి వున్నాడు గనుక, రాజకీయ విమర్శలు చేయడం వింతేమీ కాదు.

ఇక, కంగనా రనౌత్ (Kangana Ranaut) విషయానికొస్తే, ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కానీ, బీజేపీకి బీభత్సమైన సపోర్టర్.! అద్గదీ అసలు సంగతి.
‘మీకు హిందీ వచ్చు.. అందుకే, హిందీ మాత్రమే మాట్లాడతారు..’ అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మీద సెటైర్లేశారు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా.
ప్రకాష్ రాజ్ విమర్శలపై కంగనా రనౌత్ (Kangana Ranaut) ఘాటుగా స్పందించింది. అమిత్ షా గుజరాత్‌కి చెందినవారనీ, ఆయనకి గుజరాతీ కూడా వచ్చని పేర్కొంది.
దేశంపై బలవంతంగా రుద్దుతున్నారా.?
హిందీని, దేశ ప్రజలందరిపైనా బీజేపీ సర్కారు బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శ వుంది.
నిజానికి, హిందీ ఎప్పటినుంచో వుంది.. దేశంలో ప్రాంతాలకతీతంగా కొందరికి హిందీ వచ్చు. కొందరికి హిందీ రాకపోవచ్చు కూడా. అదేమీ నేరం కాదు.
Also Read: Malaika Arora: ఇంతకీ నీ వయసెంత పాపా.!
హిందీ పేరు చెప్పి, రాజకీయ విమర్శలు చేయడంలో అర్థమేముంది.?
ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందోగానీ, కుక్క కాటుకి చెప్పు దెబ్బ తరహాలో, ప్రకాష్ రాజ్‌కి కంగనా రనౌత్ (Kangana Ranaut) కౌంటర్ ఎటాక్ ఇచ్చిందన్నది మాత్రం నిర్వివాదాంశం.