Table of Contents
KCR Old Telangana Template.. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’.. ఎందుకు ‘భారత రాష్ట్ర సమితి’గా మారింది.? ఈ మార్పుతో గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సాధించింది ఏంటి.?
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామనుకుని, ‘తెలంగాణ’నే వద్దనుకున్నారు కేసీయార్. ఏ ‘తెలంగాణ’ అయితే, గులాబీ పార్టీకి ‘ఇంటి పార్టీ’ అనే గుర్తింపు తెచ్చిందో, అదే ‘తెలంగాణ’ని కేసీయార్ పీకి పారేశారు.
2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ అత్యంత దారుణ పరాజయానికి కారణాల్లో ఇది కూడా ఒకటి.! సరే, రాజకీయాల్లో ఒక్కోసారి పదునైన వ్యూహాలు కూడా బెడిసి కొడుతుంటాయి.. అది వేరే చర్చ.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. అని చెప్పుకుంటూనే వుంటాం. రాజకీయాలన్నాక రాజకీయ విమర్శలు కూడా సహజమే.. దీన్నీ తప్పు పట్టలేం.!
KCR Old Telangana Template.. కేసీయార్ మారలేదు..
చాలాకాలం తర్వాత కేసీయార్, మీడియా ముందుకు వచ్చారు.. తనదైన శైలిలో రాజకీయ విమర్శలు చేశారు.. తెలంగాణలోని అధికార కాంగ్రెస్ మీద. అది కేసీయార్ హక్కు.
అనారోగ్య కారణాలు, వృద్ధాప్య సమస్యల నేపథ్యంలో, కేసీయార్ రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు.
ఎమ్మెల్యే అయినప్పటికీ, ప్రతిపక్ష నేత కూడా అయినప్పటికీ, కేసీయార్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదు.
ఓ వైపు ఇంట్లో గొడవలు (కవిత, హరీష్ మధ్య పంచాయితీ.. కవితను పార్టీ నుంచి గెంటేయడం), ఇంకో వైపు, ఓటమి అవమానం.. వెరసి, కేసీయార్.. మునుపటిలా యాక్టివ్‌గా కనిపించలేకపోతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తావన ఎందుకు.?
ఎలాగైతేనేం, కేసీయార్ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారని.. గులాబీ శ్రేణులు కాస్త సంబర పడ్డారు. కానీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తావన తెస్తూ, ‘లేకితనం’ ఎందుకు కేసీయార్ ప్రదర్శించినట్లు.?
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపం.. అంటూ, పాత టెంప్లేట్‌ని కేసీయార్ ఎందుకు తెరపైకి తెచ్చారు.?
అలానే, తన ప్రెస్ మీట్‌లో కేసీయార్, ‘భారత రాష్ట్ర సమితి’ అనకుండా, ‘తెలంగాణ రాష్ట్ర సమతి’ అనే ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు.?
ఒకప్పటి సెంటిమెంట్ వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. రెండు తెలుగు రాష్ట్రాలూ ప్రశాంతంగా వున్నాయి. ఈ తరుణంలో కేసీయార్, మళ్లీ విద్వేష రాజకీయాలకు తెరలేపితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
చంద్రబాబు మీద కోపమా.? జగన్ మీద ప్రేమా.?
చంద్రబాబు – కేసీయార్ మధ్య రాజకీయ వైరం గురించి కొత్తగా చెప్పేదేముంది.? అలాగే, జగన్ – కేసీయార్ మధ్య స్నేహం గురించీ అందరికీ తెలిసిందే.
వైఎస్ జగన్ పుట్టినరోజున ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు మీద రాజకీయ విమర్శలు చేశారు కేసీయార్. వైసీపీ శ్రేణులు, కేసీయార్ వీడియోల్ని సోషల్ మీడియాలో తెగ తిప్పాయి. అలా కేసీయార్‌కి రీచ్ పెరిగింది.
కానీ, అదే సమయంలో, టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో కేసీయార్ మీద ధ్వజమెత్తాయి. అవసరమా ఇదంతా.?
