Keeravani Tweet Against Resul Pookutty.. మరకతమణి కీరవాణి.. అదేనండీ ఎంఎం కీరవాణికి ఒళ్ళు మండిపోయింది.
‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమా మీద ఆస్కార్ పురస్కార గ్రహీత రెసూల్ పూకుట్టి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కీరవాణి అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేశారు.!
సోషల్ మీడియా వేదికగా కీరవాణి వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. దురదృష్టమేంటంటే, ఈ ట్వీటులో కీరవాణి వాడకూడని పదజాలాన్ని వాడారు. అదీ నేరుగా కాదు.!
రసూల్ పూకుట్టి పేరులోని ఇంగ్లీషు లక్షరాల్ని హైలైట్ చేస్తూ, అత్యంత అభ్యంతకరమైన రీతిలో ట్వీటేశారు కీరవాణి.
కీరవాణి స్థాయికి అలాంటి ట్వీట్ రెసూల్ పూకుట్టి మీద వేసి వుండకూడదు. అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా.!
Keeravani Tweet Against Resul Pookutty.. కుక్క కాటుకి చెప్పు దెబ్బ తప్పదు కదా.!
కానీ, రెసూల్ పూకుట్టి తన స్థాయిని దిగజార్చేసుకుని, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మీద ‘గే లవ్ స్టోరీ’ అని వ్యాఖ్యానించిన దరిమిలా, తప్పలేదు.. అలా స్పందించాల్సి వచ్చినట్టుంది కీరవాణికి.
అయితే, కీరవాణి తప్పేమీ లేదనే వారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. అదే సమయంలో, కీరవాణి మీద కూడా కొన్న విమర్శలు కనిపిస్తున్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి దక్కుతున్న గౌరవాన్ని జీర్ణించుకోలేకపోయాడు రెసూల్ పూకుట్టి. ఇందులో అతని స్వార్ధం, భయం, పైత్యం దేనికి.? అన్నదే ఎవరికీ అర్థం కావట్లేదు.
రెసూల్ పూకుట్టి ఓ సౌండ్ టెక్నీషియన్. ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో దక్కింది. సో వాట్.!
తన పేరుని తానే చెడగొట్టుకుని..
తనకు అనూహ్యంగా దక్కిన గౌరవాన్ని ఎలాగోలా చెడగొట్టుకోవాలన్న కోణంలోనే రెసూల్ పూకుట్టి ఇలాంటి పనులు చేశాడా.? అన్న అనుమానం చాలా మందికి కలుగుతోంది.
Also Read: మొరగడం ‘వోడ్కా జీవి’ నైజం.! వద్దని ఎలా చెప్పగలం.?
‘అబ్బే, నాకేమీ దురుద్దేశాలు లేవు.. చాలామంది అనుకుంటున్నదే చెప్పాను.. నన్ను అపార్థం చేసుకోవద్దు..’ అంటూ రెసూల్ పూకుట్టి, వివాదాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే కీరవాణి గట్టిగా స్పందించాల్సి వచ్చినట్టుంది. అయితే, జుగుప్సాకరమైన ట్వీటుని వెంటనే కీరవాణి తొలగించి, ఆ తర్వాత కాస్త పద్ధతిగా, కాస్త సంస్కారవంతంగా పూకుట్టిని కడిగి పారేయడం కొనసాగించారు.