Keerthy Suresh Raghu Thatha.. ‘మహా నటి’ కీర్తి సురేష్ కొత్త సినిమా ‘రఘు తాత’. విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా రిలీజ్‌కి ముందే, బోల్డన్ని వివాదాలు నెలకొన్నాయ్.
అసలు సినిమా కథేంటి.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ మాత్రం, ఇదో ఇంట్రెస్టింగ్ మూవీ అని చెబుతోంది ‘రఘు తాత’ గురించి.
రాజకీయ పరమైన సెటైర్లు వుంటాయనీ, వివాదాస్పద అంశాలతో సినిమాని తెరకెక్కించారనీ.. సినిమాకి వ్యతిరేకంగా కొందరు నినదిస్తున్నారు.

అయితే, ఓ మహిళకు ఎదురయ్యే సమస్యలు, ఆ సమస్యల్ని ఆ యువతి మనోబలంతో ఎదుర్కొన్న తీరు.. ఇవే సినిమాలో కీలకమైన అంశాలని చెబుతోంది కీర్తి సురేష్.
Keerthy Suresh Raghu Thatha.. వివాదాలెందుకు చెప్మా.?
తమిళ, తెలుగు సహా పలు భాషల్లో ఈ ‘రఘు తాత’ విడుదల కానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇదొక ‘ఫిమేల్ సెంట్రిక్’ మూవీ.. అనుకోవచ్చు.
Also Read: ముచ్చటగా మూడోది.! జాన్వీ కపూర్ ఖాతాలో ఇంకోటి.!
కీర్తి సురేష్ చేసిన పలు ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ ఆకట్టుకున్నాయి.. కొన్ని బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయ్.
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబలే ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం గమనార్హం. ‘సినిమా చూశాక అందరికీ నచ్చుతుంది.. సినిమా వినోదాత్మకంగా వుంటుంది’ అని కీర్తి సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘రఘుతాత’ గురించి చెప్పింది.