Ketika Sharma ఒకే ఒక్క సినిమాతో ఎవర్నయినా తక్కువ లేదా ఎక్కువ అంచనాలు వేసెయ్యలేం. మరి, కేతిక శర్మ విషయంలోనో.! ఆమె మల్టీ టాలెంటెడ్. ఆ విషయం తొలి సినిమాతోనే నిరూపితమయ్యింది. నటిగా ఓ మోస్తరు మార్కులేయించుకున్న కేతిక, గ్లామర్ విషయంలో మాత్రం, అవసరానికి మించి మార్కులు సంపాదించేసింది.
కేతిక శర్మ మంచి సింగర్. ఆ టాలెంట్ తొలి సినిమా ‘రొమాంటిక్’తోనే చూపించేసింది. త్వరలోనే తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పేస్తానంటోంది. ఛాన్సులొస్తే, సింగర్‌గా తాను మరింతగా తెలుగు సినిమాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తానని చెబుతోంది ఈ రొమాంటిక్ బ్యూటీ.
Ketika Sharma ఫేవరెట్ ఎవరంటే..
ఇంతకీ, కేతిక శర్మ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరో తెలుసా.? ఇంకెవరు, సాయి పల్లవి. సాయి పల్లవి డాన్సులంటే ‘ఫిదా’ అయిపోతానంటోంది కేతిక శర్మ. సాయి పల్లవి ఎంచుకునే సినిమాలు చాలా ప్రత్యేకంగా వుంటాయనీ, తనకూ అలాంటి మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాననీ కేతిక శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

కేతిక శర్మ గ్లామరస్ బ్యూటీ. సాయి పల్లవి మాత్రం, గ్లామర్ అన్న మాట చెబితే ఆమడ దూరం పారిపోతుంటుంది. సాయి పల్లవి మంచి డాన్సర్. కేతిక శర్మ డాన్సింగ్ టాలెంట్ ముందు ముందు చూస్తామేమో. సాధారణంగా కమర్షియల్ హీరోయిన్ల పేర్లు చెప్పి, ఆ స్థాయికి వెళ్ళాలని వుందంటూ కొత్త హీరోయిన్లు చెబుతుంటారు.
Also Read: మేకప్పు.. Radhika Apte బిల్డప్పు.!
కానీ, కేతిక శర్మ (Ketika Sharma) వెరీ వెరీ స్పెషల్. అందుకే, సాయి పల్లవి తనకు ఆదర్శమని చెబుతోంది ఈ రొమాంటిక్ భామ.