Ketika Sharma .. తొలి సినిమా ‘రొమాంటిక్’ విడుదలవకుండానే, హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకుంటోంది బొద్దుగుమ్మ కేతిక శర్మ. అంటే, ఈ బ్యూటీలో కేవలం అందమే కాదు, అంతకు మించి చాలా టాలెంట్స్ వున్నాయనే అనుకోవాలి. అందం, అభినయం.. వీటితోపాటుగా, సింగింగ్ టాలెంట్ కూడా వుంది కేతిక శర్మకి.
పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ నటిస్తోన్న సినిమా ‘రొమాంటిక్’. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించింది. సినిమా ప్రారంభమైంది మొదలు, కేతిక శర్మ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయంటే, అందుక్కారణం.. ఆ ఫొటోల్లో వున్న హాట్ అప్పీల్.

అలా సోషల్ మీడియాలో హాటు హాటు ఫొటోలతో కుర్రకారుకి గాలమేసిన కేతిక శర్మ పనిలో పనిగా.. డబ్ స్మాష్ వంటి వాటితో మరింతగా తన ఫాలోయింగ్ పెంచుకుంది. అప్పుడే ఆమెలోని సింగింగ్ టాలెంటుని చాలామంది గుర్తించేశారు.
Ketika Sharma గ్లామర్ హాటు.. సింగింగ్ వెరీ నీటు..
అయితే, సినిమా నుంచి ఓ కవర్ సాంగ్‌ని విడుదల చేసేదాకా ఆమెలోని సింగింగ్ టాలెంట్ చాలామందికి తెలియకపోవడం గమనార్హం. ఏదో పబ్లిసిటీ కోసం ఓ పాటని ఆమెతో అలా అలా పాడించేశారనుకుంటే పొరపాటే. కవర్ సాంగ్ అని పేరేగానీ, చాలా బాగా పాడింది కేతిక శర్మ.
గతంలో రాశి ఖన్నా, మమతా మోహన్ దాస్, నిత్యా మీనన్.. ఇలా పలువురు అందాల భామలు తమ అంద చందాలతో, అభినయంతో.. అంతకన్నా అందమైన స్వరంతో పాటలు పాడి వారెవ్వా అనిపించుకున్నారు. ఆ కోవలోకే ఈ కేతిక శర్మ కూడా చేరుతుందా.? ఏమో, వేచి చూడాల్సిందే.
Also Read: సమంత, నాగచైతన్య మధ్యలో అతనెవ్వడు.?