Ketika Sharma Trivikram Srinivas.. చూస్తుంటే కేతిక శర్మకు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే వుంది. తాజాగా ‘బ్రో’ సినిమాలో కేతిక శర్మ కనిపించిన సంగతి తెలిసిందే.
ఇంతవరకూ కేతిక శర్మ నాలుగు సినిమాల్లో నటించింది. కానీ, అవన్నీ సో సోగానే సక్సెస్ అయ్యాయ్. కానీ, ‘బ్రో’ పరిస్థితి వేరు. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
దాంతో, కేతిక శర్మ దశ తిరిగిపోయింది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ల లిస్టులో ఇప్పుడు కేతిక శర్మ పేరు కూడా యాడ్ అయిపోయింది.
Ketika Sharma Trivikram Srinivas.. కేతిక శర్మ అంతకు మించి..
అంతేనా.! ‘బ్రో’ సినిమాకి హార్ట్ అండ్ సోల్ అయిన గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దృష్టిలో పడిందీ హాట్ బ్యూటీ. ఒక్కసారి త్రివిక్రమ్‌ని ఇంప్రెస్ చేస్తే చాలు.. ఆ హీరోయిన్‌ని తన మెమరీలో లాక్ చేసేయడం గురూజీ స్పెషాలిటీ.

ఇప్పుడా ఛాన్స్ కేతిక శర్మను వరించినట్లుగా తెలుస్తోంది. ‘బ్రో’లో కేతికకు పెద్దగా ఇంపార్టెన్స్ దక్కలేదు కానీ, అమ్మడి టాలెంట్‌ని మాటల మాంత్రికుడు కనిపెట్టేశాడట.
Also Read: Tillu Square Anupama Parameswaran: ఫుల్ షో! వితౌట్ టిక్కెట్!
సరిగ్గా వాడితే, కేతిక శర్మలో దాగున్న అసలు సిసలు టాలెంట్ బయటికి తీయొచ్చని కనిపెట్టేశాడట. దాంతో, తన నెక్స్‌ట్ మూవీలో కేతికకు ఛాన్సిస్తానని మాటిచ్చేశాడట కూడా.
త్రివిక్రమ్ నెక్స్‌ట్ సినిమా అంటే, ‘గుంటూరు కారం’ కాదండోయ్. ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ చేయబోయే సినిమా బహుశా అల్లు అర్జున్‌తో కావచ్చు, ఎన్టీయార్‌తో కావచ్చు.
ఏ సినిమా అయినా సరే, అందులో కేతికకు స్లాట్ బుక్ అయిపోయినట్లే అనుకోవచ్చేమో.! ఇది కదా గుడ్ టైమ్ అంటే.!