Khushi Kapoor Sridevi.. అతిలోక సుందరి చిన్న కుమార్టె ఖుషీ కపూర్ కూడా హీరోయిన్‌గా తెరంగేట్రానికి సిద్ధమవుతోంది. పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కి బాలీవుడ్‌లో వున్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
గ్లామర్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. అలాగే, సినిమాల విషయానికి వస్తే, జాన్వీ (Janhvi Kapoor) రూటే సెపరేటు.
కమర్షియల్ యాంగిల్ అస్సలు ఆలోచించలేదింతవరకూ. ప్రాధాన్యత వున్న పాత్రలనీ, కంటెంట్ వున్న కథలనే ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
Khushi Kapoor Sridevi.. అక్క అలా.. చెల్లెలు ఇంకెలాగో.!
ఇక, ఖుషీ కపూర్ విషయానికి వస్తే, ఇంతవరకూ ఫోటో గ్లామర్‌కే పరిమితమైంది ఖుషి. గ్లామర్‌లో అక్క జాన్వీతోనే ఖుషీ (Khushi Kapoor)కి గట్టి పోటీ అనొచ్చేమో.
ఆ రేంజ్‌లో ఖుషీ కూడా సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటుంది. ఇక, త్వరలోనే ఖుషీ (Khushi Kapoor). తెరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

హీరోయిన్‌గా బాలీవుడ్‌లో దాదాపు పదేళ్లుగా కంటిన్యూ అవుతున్నా, తెలుగులో ఇటీవలే ‘దేవర’ సినిమాతో జాన్వీ తెరంగేట్రం చేస్తోంది.
Also Read: పూనమ్ కౌర్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్.!
అయితే, ఖుషీ కపూర్ (Khushi Kapoor) మాత్రం డైరెక్ట్‌గా తెలుగు సినిమాలతోనే హీరోయిన్‌గా పరిచయమవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టిందట ఖుషీ కపూర్ (Khushi Kapoor). చూడాలి మరి, అక్కలాగే కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటుందా.?
లేక, కమర్షియల్ హీరోయిన్ అనిపించుకుంటుందా.? చూడాలి మరి.