Kiara Advani Wedding.. ‘నా పెళ్ళంట.! దయచేసి ఎవరైనా నాకు శుభలేఖ ఇవ్వరూ.! వీలైతే, పెళ్ళి ఎక్కడో చెప్పండి.. నేను కూడా వస్తా..’ అని ఈ మధ్య అందాల భామలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేయడం చూస్తున్నాం.
ఇంతకీ, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సంగతేంటి.? కియారా అద్వానీ అలియాస్ కైరా అద్వానీ, తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో తెరంగేట్రం చేసింది.
ఆ తర్వాత తెలుగులో ‘వినయ విధేయ రామ’ సినిమా కూడా చేసింది. ‘భరత్ అనే నేను’ పెద్ద హిట్ కాగా, ‘వినయ విధేయ రామ’ చాలా పెద్ద డిజాస్టర్.
Kiara Advani Wedding.. హిందీలో బిజీ బిజీ..
‘వినయ విధేయ రామ’ తర్వాత టాలీవుడ్ నుంచి కాస్త గ్యాప్ తీసుకుని, హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కైరా అద్వానీ.
ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ఓ సినిమా చేస్తోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమాకి శంకర్ దర్శకుడు.
ఈ పెళ్ళి గోలేంటి.?
గత కొంతకాలంగా కైరా అద్వానీ పెళ్ళంట.. అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఇంకో అడుగు ముందుకేసి, ఫిబ్రవరి 6న దుబాయ్‌లో పెళ్ళి.. అనేదాకా వెళ్ళింది.

కానీ, కైరా అద్వానీ ఎక్కడా తన పెళ్ళి గురించి ఇప్పటివరకూ స్పందించింది లేదు. గాసిప్స్‌ని ఖండించిందీ లేదు.
ఏమో.. కైరా అద్వానీ.. సైలెంటుగా పెళ్ళి చేసేసుకుని, పెళ్ళి ఫొటోల్ని సోషల్ మీడియాలో పెట్టినా పెట్టొచ్చుగాక.! ఈ మధ్యన ఇదో ట్రెండ్ కదా.!
Also Read: సమంత ‘ఖుషీ’.! విజయ్ దేవరకొండకి పెద్ద దెబ్బే.!
పెళ్ళి చేసేసుకుని.. ఆ తర్వాత ఆ వివాహ వేడుక తాలూకు విజువల్స్‌ని ఓటీటీ ద్వారా విడుదల చేసుకోవడం.. మళ్ళీ ఇదొక యాపారం.! ఇంతకీ కైరా ఏం చేస్తోందో.!
కైరాకి కాబోయే భర్తగా ఎవి పేరు వినిపిస్తోందో తెలుసు కదా.? ఇంకెవర్ని సిద్దార్ధ మల్హోత్రాని.!