తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మెగాస్టార్ చిరంజీవి (King Mega Star Chiranjeevi) సమ్‌థింగ్ స్పెషల్.!
ఎప్పుడో చాలాకాలం క్రితం బాలీవుడ్‌లో స్ట్రెయిట్ సినిమా చేశారాయన.! కేవలం తెలుగు సినిమాల్లోనే నటించినా, ఆయన క్రేజ్.. పాన్ ఇండియా లెవల్.!
చిరంజీవి డాన్సుల్ని మెచ్చని సినీ ప్రముఖుడు భారతీయ సినీ పరిశ్రమలో ఎక్కడన్నా వుంటాడా.?
ఔను.. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. కొణిదెల శివ శంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలో ఓ శిఖరం.! సేవా రంగంలోనూ అంతే.!
King Mega Star Chiranjeevi.. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.!
‘భోళా శంకర్’ సినిమా విషయంలో చిరంజీవి ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి జరిగినన్ని ప్రయత్నాలు బహుశా, భారతీయ సినీ పరిశ్రమలో ఇంతకు ముందు ఎప్పుడూ జరిగి వుండవేమో.!
తమిళనాట రజనీకాంత్ కూడా వరుస డిజాస్టర్లు ఎదుర్కొన్నారు. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటోళ్ళకే తప్పలేదు డిజాస్టర్లు.

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అయితే, నటన నుంచి తాత్కాలిక విరామం తీసుకోవాల్సి వచ్చింది ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’, ‘లాల్ సింగ్ చద్దా’ తదితర సినిమాల ఫెయిల్యూర్ నేపథ్యంలో.
తెలుగునాట, నందమూరి బాలకృష్ణకి డిజాస్టర్లు వచ్చాయ్. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాల రిజల్ట్ గురించి కొత్తగా చెప్పాలా.?
వెంకటేష్ కావొచ్చు, నాగార్జున కావొచ్చు.. వీళ్ళెవరూ ఫెయిల్యూర్స్‌కి అతీతం కాదు. అసలు సినిమా అంటేనే మ్యాజిక్.
విమర్శలొస్తాయ్‌గానీ..
సినిమా ఫెయిల్ అయితే విమర్శలొస్తాయ్.! కానీ, మరీ ఇంతలానా.? ‘ఆచార్య’ సినిమా టైమ్‌లోనే చిరంజీవి చాలా చాలా నెగెటివిటీని ఎదుర్కొన్నారు.
అప్పుడు మొరిగిన గ్రామ సింహాలన్నీ, ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రిజల్ట్‌తో తోకముడుచుక్కూర్చున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొదలైంది వాటి మొరుగుడు.!
ఎవరో మొరిగితే, ఏనుగు స్థాయి తగ్గిపోతుందా.? శిఖరం ఖ్యాతికి నష్టం చేకూరుతుందా.? మొరుగుతున్నోళ్ళకీ తెలుసు.. చిరంజీవి స్టామినా ఏంటో.!
Also Read: నడి రోడ్డు మీద ‘నిస్సిగ్గు రాజకీయం’ గుడ్డలూడదీసిన ‘బ్రో’.!
‘ఆచార్య’తో పనైపోయిందన్నారు.. ‘భోళా శంకర్’ సినిమాకి 65 కోట్ల రెమ్యునరేషన్ అనీ.. వాళ్ళే చెబుతున్నారు.! దటీజ్ చిరంజీవి.

తెలుగు సినీ పరిశ్రమలో 65 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న సీనియర్ హీరో ఇంకెవరైనా వున్నారా.?
పోనీ, పాన్ ఇండియా స్టార్‌డమ్ అని చెప్పుకుంటోన్నవాళ్ళలో ఈ స్థాయి రెమ్యునరేషన్ ఎంతమందికి అందుతోంది.? ఏడాదికి ఎన్ని సినిమాలు వాళ్ళ నుంచి రిలీజ్ అవుతున్నాయ్.?
అరవై ఐదేళ్ళ పైబడిన వయసులో.. ఇప్పటికీ డాన్సుల్లో గ్రేస్ తగ్గలేదు.. యాక్షన్ ఎపిసోడ్స్‌లో కష్టం తగ్గలేదు.! దటీజ్ మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్థాయి ఎప్పటికీ తగ్గదు.! తగ్గదుగాక తగ్గదు.!