కింగ్ విరాట్ కోహ్లీకీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకీ మధ్య విభేదాలున్నాయా.? (King Virat Kohli Vs Hit Man Rohit Sharma) ఏమో, వుంటే వుండి వుండొచ్చుగాక.
కానీ, ఎప్పుడూ మైదానంలో ఈ ఇద్దరి మధ్యా సఖ్యత లేనట్టు కనిపించదు. ఇద్దరూ ప్రొపెషనల్ క్రికెటర్స్. శరీరమ్మీదకి టీమిండియా జెర్సీ చేరాక, ఆడేది దేశం కోసం మాత్రమేనన్న భావనతో వుంటారు ఇద్దరూ.
వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ, అంతకు ముందూ విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మ (Virat Kohli Vs Rohit Sharma) మధ్య ‘గ్యాప్’ సుస్పష్టంగా కనిపించింది. అయితే, అదంతా ‘ఆఫ్ ఫీల్డ్’ మాత్రమే.
ఆన్ ది ఫీల్డ్.. విరాట్ కోహ్లీ కెప్టెన్.. రోహిత్ శర్మ వైస్ కెప్టెన్. రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. విరాట్ కోహ్లీ ఇంకా హ్యాపీగా వుంటాడు.
రోహిత్ శర్మ కూడా విరాట్ కోహ్లీతో (Virat Kohli And Rohit Sharma) బ్యాటింగ్ భాగస్వామ్యాన్ని ఎంజాయ్ చేస్తాడు.
ఆటగాళ్ళ మధ్య అభిప్రాయ బేధాలు సహజమే. అంతమాత్రాన అక్కడికేదో ఇద్దరూ బద్ధశత్రువులన్నట్టు మీడియా అడ్డగోలు రాతలు రాస్తేనే.. వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది.
పలు సందర్భాల్లో రోహిత్, కోహ్లీ.. తమ మధ్య విభేదాల్లేవని స్పష్టం చేశారు. ఇద్దరూ జట్టు ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు.. టీమిండియాని ఎలా విజయపథాన నిలపాలన్నదానిపై ఇద్దరి మధ్యా చర్చలు జరుగుతాయి.. జరగాలి కూడా.
‘ఆటగాళ్ళ రొటేషన్ పద్ధతిలో విరాట్ కోహ్లీ కూడా తప్పుకుంటాడా.? రోహిత్ శర్మనే ఎందుకు తప్పించారు.? అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. జట్టుని నడిపించాల్సింది నాయకుడు. ఆ నాయకుడ్ని రొటేట్ చేస్తే ఎలా.? అన్నది చాలామంది నుంచి వచ్చిన సమాధానం.
ఏది ఏమైనా వన్డే, టీ20, టెస్ట్ క్రికెట్‌లో.. కోహ్లీ, రోహిత్.. ఇద్దరూ ఇద్దరే (King Virat Kohli Vs Hit Man Rohit Sharma). ఒకరు తక్కువ కాదు, ఇంకొకరు ఎక్కువ కాదు. అదే అసలు సమస్య.. అదీ చూసేవాళ్ళకి మాత్రమే.
నీరు, నిప్పు.. రెండూ అవసరమే.. అదే సమయంలో, ఆ రెండూ ప్రత్యర్థుల గుండెల్లో నిప్పు రాజేస్తాయ్.!