Krithi Shetty Smoking.. సినిమాల్లో హీరో ఓ గుద్దు గుద్దితే వరుసగా ముగ్గురు, నలుగురు ఎగిరెగిరి ఎక్కడెక్కడో పడిపోతారు. నిజ జీవితంలో అలా జరుగుతుందా.? అంత పవర్ మానవ మాత్రుడెవడికైనా ఉంటుందా.? అందుకే అది సినిమా. అదో కల్పన. హీరోయిజం చూపించడానికి దర్శకులు అలాంటి సన్నివేశాల్ని డిజైన్ చేస్తుంటారు.
హీరో, హీరోయిన్ల మధ్య గాఢమైన మూతి ముద్దుల సన్నివేశాలైనా అంతే. ఒకప్పుడు వీటి చిత్రీకరణ కోసం చాలా రకాల ట్రిక్స్ చేసేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోతోంది సన్నివేశాలు సహజంగా ఉండేందుకోసం. ఆ చుంబన దృశ్యాల్లో హీరో, హీరోయిన్లు ఎలాంటి మొహమాటాల్లేకుండా నటించేస్తున్నారు.
ఏం చేసినా సినిమా కోసమే సుమీ.!
కొన్నాళ్ల క్రితం ఓ నటి గర్భిణీ పాత్ర పోషించాల్సి వస్తే, ఆ నటి పెద్ద రిస్కే చేసింది. సహజంగానే గర్భం దాల్చి సినిమా షూటింగులో పాల్గొంది. డెలివరీ సన్నివేశాల్ని కూడా సహజంగానే చిత్రీకరించారు. సహజత్వం కోసం చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతుంటాయ్.
హీరో, హీరోయిన్లు రిస్కీ స్టంట్లు చేస్తుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి ప్రమాదాల బారిన పడడం మామూలే. కొన్నిసార్లు నటీ నటులు ప్రాణాలు కోల్పోవడం కూడా మనకు తెలుసు. సినిమా అంటే పైకి కనిపించేంత తేలిక కాదు.. సినిమాకి చాలా ‘లోతు’ వుంది. ఆ లోతును అర్ధం చేసుకోవడం అంత సులువు కాదు.

అలాగని సినిమా అంతా నిజం కాదు. పైకి అందంగా కనిపించే సినిమా వెనక చాలా కష్టమే వుంటుంది. పైకి కనిపించే సినిమాల్లో చాలా కల్పనలూ, సత్య దూరమైన విషయాలూ చాలానే ఉంటాయ్. తెరపై నటీ నటులు ఏం చేస్తారో, అదే నిజం అనుకుంటే పొరపాటు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా కానీ, ఆయా నటీ నటుల్ని అపార్ధం చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.
Krithi Shetty Smoking.. బేబమ్మ స్మోకింగ్: అసలు కథ ఇదే..
హీరోయిన్ కృతి శెట్టి ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా కోసం గుప్పు గుప్పున స్మోకింగ్ చేసేసింది. ఈ సన్నివేశాలపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంది కృతి శెట్టి. దాంతో, ‘నేను నిజమైన సిగరెట్ కాల్చలేదు. అది హెర్బల్ సిగరెట్.. నాకు స్మోకింగ్ అంటే అస్సలు ఇష్టముండదు..’ అని కృతి శెట్టి సంజాయిషీ ఇచ్చుకోవల్సి వచ్చింది.
నిజానికి చాలా మంది అందాల భామలకు సిగరెట్ స్మోకింగ్ అలవాటే. ఇందులో ఎవ్వరినీ తప్పు పట్టడానికి లేదు. ఇలాంటి విషయాలపై కృతి (Krithi Shetty Smoking) వివరణ ఇచ్చుకోవల్సి వచ్చిందంటే, దానికి కారణం ఆమె స్మోకింగ్ చేసిన సన్నివేశాల్ని చిత్ర యూనిట్ పబ్లిసిటీ కోసం వాడటమే. అది వివాదం అవుతుందని తెలిసే ప్రోమోలో వదిలినట్లున్నారు. ఫలితం వచ్చింది కూడా.
Also Read: Pooja Hegde, Kajal Aggarwal..కైపెక్కిస్తున్న చక్కని ‘చుక్క’లు.!
ఏతా వాతా చెప్పేదేంటంటే, వాళ్లేదో చేశారనీ, వీళ్లేదో ట్రోలింగ్ చేయడం.. అర్ధం పర్ధం లేని వ్యవహారం. సినిమా అన్నాకా, చాలా ఉంటాయ్. అందులో ఈ వివాదాలూ ఉంటాయ్. కొన్ని వివాదాల వెనుక పబ్లిసిటీ తంత్రం కూడా ఉండొచ్చు.