Krithi Shetty Tollywood ఒకే ఒక్క సినిమా.. ఆమెకు అనూహ్యమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. కరోనా కష్ట కాలంలో అసలు ఆ సినిమా పరిస్థితి ఏమవుతుందా.? అని అంతా అనుకున్నారు.
కానీ, తొలి సినిమా విడుదల కాకుండానే, ‘బేబమ్మ’ తెలుగునాట, కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసింది. అంతేనా, సినీ పరిశ్రమని తనవైపుకు తిప్పేసుకుంది.
పరిచయం అక్కర్లేదు కొత్తగా ఈ బేబమ్మ గురించి. కన్నడ కస్తూరి కృతి శెట్టి, ‘ఉప్పెన’ సినిమాతో, నిజంగానే ఉప్పెనలా కుర్ర హృదయాల్లో అలజడి రేపేసింది.
Krithi Shetty Tollywood.. పాప జోరుకి బ్రేకుల్లేవంతే.!
అక్కడి నుంచి, బేబమ్మ జోరుకి అస్సలు బ్రేకులే లేవు. ‘కృతి శెట్టి ఆన్ బోర్డ్..’ అంటూ ఆమెకు పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు స్వాగతం పలికేస్తున్నాయ్.!

చేతిలో దాదాపు అరడజను వరకు కృతి శెట్టికి ప్రస్తుతం సినిమాలున్నాయంటే, ఆమె జోరు ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.
క్యూట్ మాత్రమే కాదు, తాను హాట్ కూడా.. అంటూ, ‘శ్యామ్ సింగరాయ్’తో నిరూపించేసింది ఈ బ్యూటీ.
ఆ ఛెయిర్ ఎంతో దూరంలో లేదు.!
ఆ మాటకొస్తే, తొలి సినిమా ‘ఉప్పెన’లోనే, ‘జల జల జలపాతం నువ్వు..’ పాటలో నీటుగా ఆమె చేసిన తడి అందాల విందు ముందర, ఎలాంటి మోడ్రన్ గ్లామర్ అయినా చిన్నబోవాల్సిందేననుకోండి.. అది వేరే సంగతి.
సుధీర్ బాబు, రామ్, నాగచైతన్య.. ఇలా యంగ్ జనరేషన్ హీరోలకి ఫస్ట్ ఛాయిస్‌లా మారింది బేబమ్మ. టాప్ లీగ్‌లోకి వెళ్ళాలంటే, ఒకే ఒక్క సూపర్ హిట్ కావాలామెకి.
Also Read: వామ్మో.! ఏం తెలివి.? క్లీన్ బౌల్డ్ చేసేస్తోందే.?
ఆ ఒక్క హిట్టూ, నిఖార్సయినది పడితే.. ఆ తర్వాత, టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నెంబర్ వన్ ఛెయిర్ దక్కించుకోవడం కృతి శెట్టికి పెద్ద కష్టమేమీ కాదు.!
తెలుగమ్మాయిని కాకపోయినా, తెలుగు ప్రేక్షకులు తనను తమ సొంత మనిషిలా ఆదరిస్తున్నారనీ, తెలుగు సినిమాల వల్లనే తనకు ఈ స్థాయి గౌరవం దక్కాయని చెబుతోంది కృతి శెట్టి.
ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినాసరే, తన తొలి ప్రాధాన్యత తెలుగు సినిమాలకేనని కృతి శెట్టి చెప్పుకొచ్చింది.