Table of Contents
తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇస్తూనే సూపర్ హిట్ కొట్టేసింది బెంగళూరు బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty Uppena Bebamma Eshwara). కమర్షియల్ హిట్ కొట్టడమే కాదు, నటిగానూ ఆమెకు మంచి ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే పరిణతి కలిగిన నటనా ప్రతిభను ప్రదర్శించిందంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించేస్తున్నారు.
అంత టాలెంట్ వుంది కాబట్టే, తొలి సినిమా విడుదల కాకుండానే పలు సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది ఈ బెంగళూరు బ్యూటీ.
Also Read: సినిమా రివ్యూ: ఉప్పెన
ప్రస్తుతం తెలుగులో నాని సరసన ‘శ్యామ్ సింగారాయ్’ సహా పలు సినిమాల్లో నటిస్తోంది కృతి శెట్టి. ఇదిలా వుంటే, మహాశివరాత్రి సందర్భంగా కృతి శెట్టి (Krithi Shetty) ఓ వీడియో విడుదల చేసింది.
అది ‘ఈశ్వరా’ అంటూ సాగే పాట. ‘ఉప్పెన’ సినిమాలోనిది ఈ పాట. అయితే, ఆ పాటకి సంప్రదాయ నృత్యం చేసిన కృతి శెట్టి, మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసింది. అంతే, అంతా.. ఆ వీడియో చూసి షాక్ అయ్యారు.
Also Read: శిష్యుడి ‘ఉప్పెనంత’ విజయం.. ఆ ధైర్యమిచ్చింది ఈ గురువే.!
సంప్రదాయ నృత్యంలో ఆమెకు అంత ప్రతిభ వుంది కాబట్టే, ఎక్స్ప్రెషన్స్ అంత బాగా పండించిందని ‘ఈశ్వరా’ వీడియో చూసినవారంతా కృతి శెట్టిపై (Krithi Shetty Uppena Bebamma) ప్రశంసలు కురిపించేస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఈ ‘ఉప్పెన’ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరంగేట్రం చేసిన విషయం విదితమే. ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ వసూళ్ళను సొంతం చేసుకుంది.
Also Read: ఇది మెగా ‘ఉప్పెన’.. తొక్కేయాలనుకోవడం మూర్ఖత్వం.!
హీరోకీ, హీరోయిన్‌కీ, దర్శకుడికీ.. తొలి సినిమాతోనే ఇంత పెద్ద విజయం అందడం గొప్ప విషయమే. అన్నట్టు, తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటి అనిపించుకునే అన్ని అనర్హతలూ కృతి శెట్టికి వున్నాయని ‘ఉప్పెన’ తర్వాత ఆమెకు (Krithi Shetty Uppena Bebamma Eshwara) పలువురు సినీ పరిశ్రమ ప్రముఖుల నుంచి ఆశీస్సులు లభించిన సంగతి తెలిసిందే.
