Kriti Kharbanda Pet Dog.. పెంపుడు జంతువు కావొచ్చు.. కానీ, కుక్క కుక్కే కదా.! అంతే లే.! మనుషుల్ని ప్రేమించడం చేతకావట్లేదుగానీ, జంతువుల్ని బాగా ప్రేమించేస్తుంటారు కొందరు.!
ఏంటండీ మరీనూ.! ఏం, జంతువుల్ని ప్రేమించకూడదా.? మనుషులతో పోల్చితే జంతువులే బెటర్.! పైగా, విశ్వాసం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కుక్కే.!
సాటి మనిషిని ప్రేమిస్తే, తిరిగొచ్చేది శతృత్వమే ఈ రోజుల్లో.! ఇలా క్లాసులు పీకేటోళ్ళ గురించి ఏం చెప్పగలం.? అందులోనూ నిజం లేకపోలేదు.!
Kriti Kharbanda Pet Dog.. తీన్‌మార్ పోరీ.!
కృతి ఖర్బందా గుర్తందా.? అదేనండీ, సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘బోణీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కదా.. ఆ అందాల భామే.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘తీన్‌మార్’ సినిమాలోనూ నటించింది కృతి. ఆ తర్వాత ఒకటీ అరా సినిమాల్లో నటించినా, తెలుగునాట స్టార్‌డమ్ దక్కించుకోలేకపోయింది.
ప్రస్తుతానికైతే బాలీవుడ్‌కే ఫిక్స్ అయిపోయింది కృతి. అన్నట్టు, రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రూస్‌లీ’ సినిమాలో హీరోకి సోదరిగా నటించిందీ భామ.
పెంపుడు శునకంతో చుంబనం.!
మరీ.. మూతి ముద్దు అనలేంగానీ.! దాదాపు అలాంటిదే. ఫొటోలో చూస్తున్నాం కదా.! పెంపుడు జంతువుల్ని ప్రేమగా చూసుకోవడాన్ని తప్పుపట్టలేం. కానీ, మరీ ఇంతలానా.?
పెంపుడు జంతువులంటే పెద్దగా గిట్టనివారికీ.. కాస్తో కూస్తో ఇష్టపడేవారికీ.. ఇది ఎబ్బెట్టుగానే వుండొచ్చుగాక.!

నిజానికి, ఒక్కోసారి.. ఆ పెంపుడు జంతువులు.. బోల్డంత మానసిక ప్రశాంతనిస్తాయ్.! కుటుంబ సభ్యులు కూడా పంచలేనంత ప్రేమని పంచి ఇస్తాయ్.!
Also Read: Krithi Shetty.. బేబమ్మా.! ఇలా అయ్యిందేంటమ్మా.?
వాటికీ ఎమోషన్స్ వుంటాయ్ కదా.! తమ జాతితో కాకుండా, మానవ జాతితో మాత్రమే కలిసి జీవించాల్సి వస్తే.. అలాంటివాటికి.. ఇలాంటి ప్రేమ పంచిస్తే తప్పేం లేదు.!

కానీ, కొందరుంటారు.. ట్రోలింగ్ మీదనే బతికేస్తుంటారు.! అలాంటోళ్ళకి మాత్రం.. బోల్డంత స్టఫ్.. ఇలాంటి ఫొటోల వల్ల.!
ఆ స్టఫ్ ఇవ్వడానికేనా.. ఈ తరహా ఫొటోల్ని సోషల్ మీడియాలో కృతి ఖర్బందా (Kriti Kharbanda) విడుదల చేసింది.?