Kriti Sanon Fitness Goals.. శరీరం నాజూగ్గా వుండాలంటే, రోజూ వ్యాయామం చెయ్యాలి. ఆహార నియమాలు పాటించాలి.
కంటికి సరిపడా నిద్ర.. దాంతోపాటుగా, మనసు ప్రశంతంగా వుంచుకోవడం.. ఇదంతా తప్పనిసరి.
సెలబ్రిటీలకు ఇవన్నీ పాటించడమంటే చాలా చాలా కష్టం. అయినా, నాజూగ్గా వుండటమంటే ఆరోగ్యంగా వుండడం కూడా. నాజూగ్గా వుండకపోయినా ఫర్లేదు, బొద్దుగా వున్నా.. ఆరోగ్యంగా వుంటే అంతకన్నా కావాల్సిందేముంది.?
సెలబ్రిటీలు బొద్దుగా వుంటే అవకాశాలు తగ్గుతాయ్.! అందుకే, ఆహార నియమాల సంగతెలా వున్నా, వర్కవుట్ల విషయంలో చాలా చాలా కష్టపడిపోతుంటారు.

ఒక్కోసారి అనూహ్యంగా డైట్ కంట్రోల్ చేసేస్తారు. అలా చేసినా, బరువు తగ్గే అవకాశం లేకపోతే, సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. వెరసి, ఎలాగైతేనేం.. శరీరాన్ని నాజూగ్గా మార్చేసుకోవడమే వాళ్ళ లక్ష్యం.
Kriti Sanon Fitness Goals.. కృతి సనన్.. అప్పుడు పెరిగి.. ఆ తర్వాత తగ్గి.!
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ విషయానికొస్తే, ‘మిమి’ సినిమా కోసం ఆమె కాస్త బరువు పెరిగింది. అలా బరువు పెరగడం వల్ల, మళ్ళీ తగ్గేందుకు ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఎలాగైతేనేం, మళ్ళీ సాధారణ ఫిజిక్‌కి.. అంటే, జస్ట్ జీరో సైజ్ అనుకోవచ్చు.. ఆ స్థాయికి వచ్చేసింది కృతి సనన్ (Kriti Sanon).

అలా నాజూగ్గా తయారైన శరీరాన్ని ఇంకాస్త నాజూగ్గా వుంచుకోవాలి కదా.? అందుకే, కఠినమైన వర్కవుట్లు రెగ్యులర్‌గా చేస్తూనే వుంటోంది.
రబ్బరు బొమ్మ కాదు.. అందాల భామే.!
అలా, ఓ వర్కవుట్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కృతి సనన్. చూస్తున్నారు కదా.. ఎంతలా కష్టపడుతోందో.! నువ్వసలు మనిషివేనా.? లేదంటే రబ్బరు బొమ్మవా.? అని నెటిజనం ప్రశ్నిస్తున్నారు ఈ బ్యూటీని.
తెలుగులో ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెరంగేట్రం చేసింది కృతి సనన్. మహేష్‌బాబు, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అది.
Also Read: రమ్యము.. నరేషము.! ఎంత అ‘పవిత్ర’ము.!
ఆ తర్వాత, నాగచైతన్య హీరోగా రూపొందిన ‘దోచెయ్’ సినిమాలోనూ నటించింది కృతి. అంతే, ఆ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కన్పించలేదు. తాజాగా ప్రభాస్ సరసన కనిపించబోతోంది కృతి సనన్.