Kriti Sanon Male Domination.. ‘ఎంతైనా, వాళ్ళు మగాళ్ళు కదా.. ఆ మగాళ్ళతో పోల్చితే, మాకు అది కష్టమే..’ అంటోంది నటి కృతి సనన్. ఇంతకీ, ఏ విషయంలో.!
సినీ పరిశ్రమలో ‘మేల్ డామినేషన్’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా రంగలోనే కాదు, ‘మేల్ డామినేషన్’ అన్ని రంగాల్లోనూ వుంది.
ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. ఇదే వాస్తవం. అలాగని, మగాళ్ళు ఆయా రంగంలో తొక్కివేయబడటం లేదా.? అంటే, ఎందుకు లేదు.. అదీ వుంది.
Kriti Sanon Male Domination.. మంచి కారు కూడా కష్టమే..నా.?
మంచి కారు.. హోటల్లో బస చేయాల్సి వస్తే మంచి రూమ్.. వీటి విషయంలో కూడా, మగాళ్ళతో పోల్చుకోలేని పరిస్థితి మహిళలకు సినీ పరిశ్రమలో వుందన్నది కృతి సనన్ ఆవేదన.
‘అన్ని సందర్భాల్లోనూ ఇలాగే జరుగుతోందని అనలేం. కానీ, చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంటుంది’ అని కృతి సనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

‘షూటింగ్‌కి పిలిచే క్రమంలో, ముందుగా హీరోయిన్ని పిలిచి.. హీరో వచ్చేదాకా ఎదురుచూసేలా చేస్తారు..’ అంటూ కృతి సనన్ ఆరోపించింది.
‘నాకూ అలాంటి అనుభవాలున్నాయి. కాకపోతే, వాటిని లైట్ తీసుకుని ముందుకు వెళ్ళాను. కొన్నిసార్లు ప్రశ్నించాను కూడా..’ అని కృతి సనన్ చెప్పుకొచ్చింది.
స్టార్డమ్ వస్తే, అన్నీ మారతాయ్..
స్టార్డమ్ వచ్చాక పరిస్థితుల్లో కొంత మార్పు వస్తుందనీ, స్టార్ అయ్యాక.. హీరోలతో సమానంగానే హీరోయిన్లనూ చూస్తారని కృతి సనన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
కొన్నిసార్లు, హీరో కంటే కూడా హీరోయిన్‌కి ప్రత్యేకమైన గౌరవం దక్కుతుంటుంది.. నేనూ అలాంటి గౌరవాన్ని అందుకున్నానని కృతి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది.
‘రెమ్యునరేషన్ విషయంలో మాత్రం, ఎప్పటికీ హీరోలదే పై చేయి.. దానికి చాలా కారణాలున్నాయ్.. క్రౌడ్ పుల్లింగ్, ఫ్యాన్ బేస్.. ఇవన్నీ అందులో ముఖ్యమైనవి’ అని పలు సందర్భాల్లో హీరోయిన్లు చెప్పడం విన్నాం.
నిజానికి, కృతి సనన్ చేసిన వ్యాఖ్యల్నే గతంలో తాప్సీ సహా పలువరు నటీమణులు ప్రస్తావించారు, ప్రస్తావిస్తూనే వున్నారు.