Kushitha Kallapu Venu Swamy.. ‘ఎప్పుడో చాలాకాలం క్రితం కలిశానేమో.! ఆయన వల్లే నాకు పాపులారిటీ పెరిగిందనడం సబబు కాదు..’ అంటోంది కుషిత.!
కొన్నాళ్ళ క్రితం ఓ పబ్‌లో పోలీసులు రెయిడ్ చేస్తే, ఆ సమయంలో కుషిత కూడా అక్కడే వుంది.. పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు.
హైద్రాబాద్‌లో జరిగిన ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం. ‘మిర్చి బజ్జి’ అని పేరు పెట్టారు కొందరు ఆ ఘటన తర్వాత కుషితకి.

సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ, ఫొటోలు పోస్ట్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంటూ వస్తున్న కుషిత, ఓ సినిమాలో హీరోయిన్‌గా కూడా ఛాన్స్ కొట్టేసింది.
Kushitha Kallapu Venu Swamy.. పిట్ట కొంచెం.. కూత ఘనం..
తాజాగా ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా, మీడియా ఎదురు పడి ప్రశ్నలు సంధిస్తే, వాటికి జాగ్రత్తగా సమాధానాలు చెప్పింది.
అయితే, కుషిత పాపులర్ అయిపోతుందని తానే చెప్పానంటూ వేణు స్వామి అనే జ్యోతిష్యుడు చేసిన వ్యాఖ్యలపై మీడియా ఆమెను ప్రశ్నిస్తే, ఒకింత షాక్ అయ్యింది.

ఆయన చెప్పినవన్నీ నిజాలే అయితే, ఆ ఘటన విషయమై హెచ్చరించి వుండాల్సింది కదా.? నేనూ జాగ్రత్త పడేదాన్ని.. అని సెలవిచ్చింది కుషిత.
రాజకీయాలెందుకు పాపా.?
అక్కడితో ఆగలేదు.! ఏపీలో మళ్ళీ వైఎస్ జగన్ గెలుస్తారని ఆయన (వేణు స్వామి) అంటున్నారు, ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా.. అని సెటైరేసింది.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. గెలుపోటముల గురించి ఇప్పుడే చర్చ అనవసరం.
Also Read: ‘టిల్లు స్క్వేర్’ లిల్లీ.! గ్లామర్ డోస్ ఎక్కువైందిలే.!
ఇక, వేణు స్వామి జాతకం అంటారా.? మూడోసారీ కేసీయారే సీఎం.. అని సెలవిచ్చింది ఆయనే. రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు సంతాన యోగం లేదనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు వేణు స్వామి.

మీడియా చేసే అతి కారణంగా వేణు స్వామి పాపులర్ అవుతున్నాడు తప్ప, అంతకు మించి.. అతనికి సీన్ లేదు.
సరే, వేణు స్వామి సంగతి పక్కన పెడితే, కెరీర్ ప్రారంభంలో కుషితకి ఇలాంటి వివాదాలు అవసరమా.? అని కొందరు ప్రశ్నిస్తోంటే, ‘ఎంత క్యూటుగా కౌంటర్ ఎటాక్ ఇచ్చిందో కదా..’ అని ఇంకొందరు ఆమెను సమర్థిస్తున్నారు.