L2E Empuraan Mohanlal.. ‘ఎంపురాన్’ పేరుతో, ‘లూసిఫర్’ సీక్వెల్ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
మలయాళ నటుడు, దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన సినిమా ఈ ‘ఎల్2ఇ ఎంపురాన్’.!
‘లూసిఫర్’ ఘనవిజయం సాధించడంతో, ఆ సినిమా సీక్వెల్ ‘ఎంపురాన్’ మీద ప్రీ రిలీజ్ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి.
సాంకేతిక కోణంలో చూస్తే, సినిమా బావుందన్న రివ్యూలు కూడా వచ్చాయి. యాక్షన్ ఎపిసోడ్స్, హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్.. బావున్నాయంటూ సినిమాకి ప్రశంసలూ దక్కాయి.
L2E Empuraan Mohanlal.. ప్రోపగాండాకి చెప్పు దెబ్బ..!
అయితే, ఓ వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా సినిమా తెరకెక్కిందనీ, ఇది పూర్తిగా ‘ప్రోపగాండా సినిమా’ అంటూ విమర్శలూ పోటెత్తాయ్.

ఓ రకంగా, ఈ తరహా వివాదాలు కొన్ని సినిమాలకు పబ్లిసిటీ పరంగా ప్లస్ అవుతాయి. అయితే, సినీ నటుడు మోహన్ లాల్, తొలుత ఈ విమర్శలపై స్పందించాడు.
ఉద్దేశ్యపూర్వకంగా తామెలాంటి ప్రోపగాండాకీ పాల్పడలేదని చెప్పాడు. వివాదాల నేపథ్యంలో, తగిన నిర్ణయం తీసుకుంటామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు కూడా.
క్షమాపణ చెప్పిన మోహన్ లాల్..
ఒక్కమాటలో చెప్పాలంటే, మోహన్ లాల్.. జరిగిన తప్పుకి క్షమాపణ చెప్పేసినట్లే. ఆ వెంటనే, సినిమా టీమ్ నుంచి కూడా స్పందన వచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్‌కి కత్తెర వేశారు.
కొన్ని పదాల్ని మ్యూట్ చేయడం, కొన్ని సన్నివేశాలపై కత్తెర వేటు వేయడం ద్వారా.. వివాదానికి ‘ఎంపురాన్’ టీమ్ ముగింపు పలికే ప్రయత్నం చేసింది.
Also Read: ‘పెద్ది’గా రామ్ చరణ్.! థాంక్యూ బుచ్చిబాబూ.!
మోహన్ లాల్ వేసిన ట్వీట్ మీద, స్పందించీ స్పందించనట్లు ట్విట్టర్‌లో ఓ చిన్న కామెంట్ వేసి ఊరుకున్నాడు దర్శకుడు, నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్.
మొత్తమ్మీద, ఏదో అనుకుంటే.. ఇంకోటేదో అయ్యింది. ‘ఎంపురాన్’ కాస్తా వివాదాల ‘కంపురాన్’గా మారిపోయింది.! పనిగట్టుకుని చేసిన దుష్ప్రచారానికి షాక్ తగిలినట్లయ్యింది.