Table of Contents
Land Farming Real Estate.. భాగ్యనగరం హైద్రాబాద్‌లో ఎకరం వంద కోట్లు పలికిందట.! కోకాపేట పేరు మార్మోగిపోతోందిప్పడు.!
నిజానికి, పట్టణాల్లో ఎక్కడికక్కడ భూముల ధరలు మండిపోతున్నాయ్.! ఇది అందరికీ తెలిసిన విషయమే.
లక్షల్లో ఇళ్ళు.. ఆ లెక్కలు దాటేశాయ్.! ‘వన్ సీఆర్’ అంటున్నారు చాలామంది. ఇదొక స్టైల్ ఫ్యాక్టర్.!
ఓ పది కోట్లు వెచ్చించి ఇల్లు కట్టుకున్నామే అనుకోండి.! అందులో అదనంగా ఏముంటాయ్.? లగ్జరీ.!
ఏంది బ్రో ఇది.!
‘బ్రో’ సినిమాలో ‘టైమ్ దేవుడు’ ఓ డైలాగ్ చెబుతాడు.! ఈ భూమ్మీద అందరం అతిథులమేనని.!
అతిథుల్లా వచ్చిపోతామని అందరికీ తెలుసు.! మరెందుకిదంతా.? అంటే, అదంతే.! పోయేటప్పుడు ఎవడూ తనతో ఏమీ తీసుకుపోడు.
కానీ, బతికున్నన్నాళ్ళూ వీలైనంత ఎక్కువ ‘మూటగట్టేయాలి’ అనుకుంటాడు. చివరికి మూటగట్టుకుపోయేది పాప పుణ్యాలేనని తెలిసి కూడా.. మనిషి మూర్ఖత్వానికి హద్దు వుండదు.

భూముల ధరల విషయానికొద్దాం.! ఇప్పటికైతే ఎకరం వంద కోట్లు రికార్డు.! ఇంకో రెండు మూడేళ్ళ తర్వాతో.. పదేళ్ళ తర్వాతో.. ఎకరం వెయ్యి కోట్లు అయితేనో.!
Land Farming Real Estate.. వెయ్యి.. లక్ష.. కోటి..!
ఒకప్పుడు వెయ్యి రూపాయలు గొప్ప.. ఆ తర్వాత లక్ష రూపాయల మార్క్ చిన్నదైపోయింది.
ఇప్పుడైతే, కోటి రూపాయలు సంపాదిస్తే చాలు లైఫ్ సెటిలైపోతుందని చాలామంది అనుకోవచ్చుగాక.!
కొత్త టార్గెట్ వంద కోట్లని అనుకోవాలేమో.! సరే, భూములన్నీ అమ్ముకుంటూ పోతే, రైతు వ్యవసాయమెక్కడ చేస్తాడు.?
Also Read: Manipur Women Violence.. సిగ్గు పడదాం.! కానీ, ఎలా.?
ఆ ఒక్కటీ అడక్కూడదంతే.! ల్యాబోరేటరీల్లో మటన్ కూడా తయారైపోతోంది.! సో, అలా బతికేయడమే.!
ఇంకో చిన్న డౌటానుమానం.! భూమ్మీద జనం పుచ్చిపోతున్నారు కదా.! పైగా, భారతదేశంలో రికార్డు స్థాయిలో జనాభా కనిపిస్తోంది కదా.?
భూమి కొత్తగా పుట్టదు కదా.?
ముందు ముందు ఇంకా జనాభా పెరిగిపోతేనో.! భూమి అయితే కొత్తగా పుట్టదు మరి.!
డబ్బు సంపాదించడం చేతకానోడు ‘పద్ధతుల గురించి మాట్లాడతాడు’ అన్న భావన వుండొచ్చుగాక.!
డబ్బ సంపాదిస్తాం సరే.. దాన్ని మనతో తీసుకెళ్ళిపోలేం కదా.? పుట్టకముందే, అమ్మ కడుపులో వున్నప్పుడే డయాబెటిస్ లాంటి రోగాల బారిన పడుతున్నాం.!
ప్చ్.. అయినా మనిషి మారడంతే.! డబ్బు మీద వ్యామోహం తగ్గదంతే.! అందుకే, ధరలు పెరుగుతున్నాయ్.. పెరుగుతూనే వుంటాయ్.
వంద కోట్లు.. వెయ్యి కోట్లు.. లక్ష కోట్లు.. ఎంతైతేనేం.. పోగేసెయ్యండిక.! పోగెయ్యగలిగినోడు దమ్మున్నోడు.. మరి, చేతకాకపోతే.!
భూముల ధరలు పెరగడమే అభివృద్ధి అనే స్థాయికి.. అత్యంత అధమ స్థాయికి.. జనం మెదళ్ళని మొద్దుబారేలా చేయగలుగుతున్నారు.! మీకర్థమవుతోందా.?