Less Corrupted Kambothu.. కరప్షన్లెస్ గవర్నమెంట్ గురించి విన్నాంగానీ, ‘లెస్ కరప్టడ్’ అనే మాట ఎక్కడా విన్లేదే.! అయినా, కరప్షన్లెస్ గవర్నెన్స్ ఇప్పుడెక్కడ వుంది.?
ఆడికంటే ఘనుడు ఇంకొకడు.! ఇదీ, ఇప్పటి ప్రభుత్వాల తీరు.! ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అన్న తేడాల్లేవు. అందరిదీ ఒకటే బాట.!
వాడేమో అంత తిన్నాడు.. వీడేమో ఇంకొంచెం ఎక్కువ తిన్నాడు.. మరొకడేమో ఇంకా ఇంకా ఎక్కువ తినేశాడు.. ఇంకొకేడమో చాలా చాలా ఎక్కువ తినేస్తాడు.. ఇదీ నేటి రాజకీయం.!
ఎన్నికల్లో పోటీ చేయడానికి వందల కోట్లు ఖర్చు చేయాల్సిన దుస్థితి. ఆ సొమ్ములు ఎక్కడినుంచి వస్తాయ్.? అవినీతి చేస్తే వస్తాయ్.!
Less Corrupted Kambothu.. పోటీ చేయాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే..
సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్సే లేకుండా పోతోంది. ఫలానా అసెంబ్లీ నియోజకవర్గమా.? అయితే, యాభై కోట్లు.. కాదు, సరిపోవ్.. ఓ డెబ్భయ్ ఐదు సెట్ చేసుకో.. అని రాజకీయ పార్టీలే అభ్యర్థులకు తెగేసి చెబుతున్న రోజులివి.
అందుకే, ఓ అమాత్యుడు నోరు జారేశాడు. తాను అవినీతిపరుడ్ని కాదని ఎక్కడా చెప్పలేననీ, కాకపోతే లెస్ కరెప్టెడ్ అని మీడియా సాక్షిగా సెలవిచ్చాడు. అదీ, ఓ ఇంటర్వ్యూలో.
మామూలుగా అయితే, వెంటనే మనోడ్ని బొక్కలోకి తోసెయ్యాలి.! కానీ, నిద్దరోతున్న వ్యవస్థలు, ఇలాంటోళ్ళని స్వేచ్ఛగా.. అచ్చోసిన ఆంబోతుల్లా వదిలేస్తూనే వుంటాయ్.
ఏ నేరం చిన్నది.?
కత్తితో పొడవడం నేరం.! అవతలి వ్యక్తి చనిపోతే హత్యా నేరం. బతికే వుంటే, హత్యాయత్నం.! శిక్ష చిన్నదా.? పెద్దదా.? అన్నది నేరం తాలూకు తీవ్రతని బట్టి వుంటుంది.
లెస్ కరప్టడ్.. అంటే, క్రైమ్.! దానికి శిక్ష పడి తీరాలి. నేరం చేసినోడే, తాను నేరం చేశానని ఒప్పుకుంటున్నప్పుడు, శిక్ష కూడా అనుభవించి తీరాలి కదా.?
Also Read: నిన్ను చేరే దారేదీ.! సేనానీ.. జనసైనికుల ఆవేదన ఇదీ.!
ఇంతకీ, ఆ లెస్ కరప్టెడ్ కామ్బోతు ఎవరు.? ప్రజాధనాన్ని లూటీ చేసే వెధవలందరూ ఆంబోతులే. అలాంటి సవాలక్ష ఆంబోతుల్లో ఇదీ ఒకటి.! అచ్చోసిన ఆంబోతు ఇది.!
ఆగండాగండీ.. ఆంబోతులు సిగ్గు పడతాయ్ ఇలాంటోళ్ళని చూసి.! అందుకే, కామ్బోతు.. అన్నది.!
గుమ్మడికాయల దొంగలు ఎవరైనాసరే, నిర్లజ్జగా భుజాలు తడిమేసుకోవచ్చని సవినయంగా మనవి చేసుకుంటున్నామ్.!
– yeSBee