Lucky Beauty Meenakshi Chaudhary.. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. అస్సలు అంచనాలే లేవీ సినిమా మీద. సుశాంత్ హీరోగా తెరకెక్కింది.
చాలా చిన్న సినిమా. చాలా చాలా లో బడ్జెట్ మూవీ అయినా కానీ, పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి.
ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఊహించి కూడా వుండరు. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించే చాన్స్ కొట్టేసింది మీనాక్షి చౌదరి.
Lucky Beauty Meenakshi Chaudhary.. ‘అలా’ వచ్చి ‘ఇలా’ సెటిలైపోయింది.!
అందాల పోటీల నుంచి వెండితెరపై హీరోయిన్లుగా తెరంగేట్రం చేసిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు.

ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా తదితర ముద్దుగుమ్మలు ఆ లిస్టులో మొదటి వరుసలో వుంటారు. నేటి కాలంలో అలా ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మల్లో పెద్దగా సక్సెస్ రేటు లేదనే చెప్పొచ్చేమో.
కానీ, మీనాక్షి విషయంలో వేరే. వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. మాస్ రాజా రవితేజ సరసన ‘ఖిలాడీ’ సినిమాతో పాపులర్ అయ్యిందీ హర్యానా బ్యూటీ.
ఆ తర్వాత నుంచీ వరుసగా ఆఫర్లు కొల్లగొడుతోంది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగులోనే నాలుగైదు ప్రెస్జీజియస్ ప్రాజెక్టులున్నాయ్.
అక్కడా ఇక్కడా.. సౌత్ మొత్తం దున్నేస్తోందిగా.!
అందులో ఒకటి మహేష్ – త్రివిక్రమ్ కాంబో మూవీ ‘గుంటూరు కారం’. అలాగే, యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది మీనాక్షి చౌదరి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ‘మట్కా’ సినిమాలో నటిస్తూ.. మెగా కాంపౌండ్‌నీ టచ్ చేసేసిందీ ఖిలాడీ బ్యూటీ. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో రీసెంట్‌గా ఓ ప్రాజెక్ట్ సైన్ చేసింది.
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ సరసన నటించే బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ఇళయ దళపతి విజయ్ 68వ చిత్రం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
Also Read: ప్రకాష్ రాజ్‌కి ఝలక్ ఇచ్చిన కంగనా రనౌత్.!
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఎంపికైందని తెలుస్తోంది. చూస్తుంటే, మీనాక్షి జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. ‘గుంటూరు కారం’ సూపర్ హిట్ అయితే మాత్రం అటుపై అమ్మడు స్టార్ హీరోయిన్ ఛైర్ ఎక్కేయడం ఖాయం.!