Magnetic Floating House.. ప్రపంచం మారుతోంది.! ఆకాశహార్మ్యాల నిర్మాణం వేగం పుంజుకుంటోంది. హైద్రాబాద్ నగరంలోనూ 40 అంతస్తుల పైన, భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది.
మరి, తీవ్ర భూకంపాలు సంభవిస్తే ఏంటి పరిస్థితి.? ఫలానా చోట మాత్రమే భూకంపాలు వస్తాయ్.. ఫలానా చోట భూకంపాలు అస్సలు రావు.. అని బల్ల గుద్ది మరీ చెప్పడానికి వీల్లేదు.
ఎందుకంటే, భూమి పొరల్లో కదలికల గురించి మనకి తెలిసింది తక్కువే. తెలియాల్సింది చాలానే వుంది మరి.! కొన్ని కదలికలు, ఎంతటి తీవ్ర భూకంపాలకు దారి తీస్తాయో ఊహించలేం.
ఈ నేపథ్యంలో, భూకంపాల తాకిడిని తట్టుకునేలా భవనాల నిర్మాణం జరుగుతోంది. అనేక రకాల పరిశోధనల నేపథ్యంలో, ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో బహుళ అంతస్తుల భవనాల్ని నిర్మిస్తున్నారు.
Magnetic Floating House.. ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకోవాలంటే..
అయినాగానీ, ప్రకృతి ప్రకోపాన్ని ఎలా ఆపగలం.? మయన్మార్ – థాయ్‌లాండ్ భూకంపం నేపథ్యంలో, బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోవడం చూశాం.
ఇలాంటి పరిస్థితుల్లో, మరింతగా పరిశోధనలు జరగాల్సి వుంది భవన నిర్మాణాలకు సంబంధించి. భూకంపాల దేశంగా చెప్పబడే జపాన్, ఈ విషయంలో ఆల్రెడీ ముందడుగు వేసేసింది.
భూమిని తాకకుండానే, గాల్లో భవనాల్ని నిర్మించేయొచ్చన్న కోణంలో ప్రయోగాలు సాగుతున్నాయి. మాగ్లెవ్ రైళ్ళ గురించి వినే వుంటారు.
అయస్కాంత ప్రభావంతో, మాగ్లెవ్ రైళ్ళు, పట్టాలకు కొన్ని సెంటీమీటర్ల ఎత్తున గాల్లోనే వుంటాయి. పట్టాలకు అస్సలు టచ్ కావు ఈ రైళ్ళు. అత్యంత వేగంగా దూసుకెళ్తాయ్.
గాల్లో తేలినట్టుందే..
అదే మాగ్నెటిక్ సాంకేతిక, భవన నిర్మాణ రంగంలో వినియోగించగలిగితే.? ఆ ఆలోచనతో కొన్ని ప్రయోగాలు జపాన్‌లో జరిగాయి, జరుగుతూనే వున్నాయి.
పైన ఫొటోలో చూస్తున్నారు కదా.. ఇదీ డిజైన్.! ఇలా చేస్తే, అసలు భూకంపాలతో సమస్యే వుండదు. కానీ, ఎన్ని అంతస్తులు ఇలా నిర్మించగలం.? అన్నదే ప్రశ్న.
Also Read: చావు భయం: పెళ్ళాన్ని ప్రియుడికిచ్చేసి బతికిపోయిన భర్త.!
ఏమో, ముందు ముందు బహుళ అంతస్తుల భవనాలకీ, ఈ తరహా మ్యాగ్నెటిక్ టెక్నాలజీని అప్లయ్ చేయొచ్చేమో.! సాంకేతికత ఎలాంటి అద్భుతాలకైనా మార్గం చూపించవచ్చు.
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు.. అంటే ఇదేనేమో.!