Maheshbabu Trivikram.. సూపర్ స్టార్ మహేష్‌బాబు ఎక్కడ.? గత కొంతకాలంగా ఇదే ప్రశ్న అభిమానుల్ని ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.!
ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం వచ్చింది ‘సర్కారు వారి పాట’ సినిమా. ఆ వెంటనే, త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళాల్సింది. కానీ, ఆలస్యమయ్యింది.
మరోపక్క, రాజమౌళితో మహేష్ చేయబోయే సినిమాకి సమయం దగ్గరపడుతోంది. త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఇదే అభిమానుల ఆందోళనకు కారణం.
Maheshbabu Trivikram .. మొదలైంది.. ఆగిపోయింది..
మహేష్ (Super Star Maheshbabu) – త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్ళింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. కథ పూర్తిగా మారిపోయిందన్న ప్రచారమూ తెరపైకొచ్చింది.
మళ్ళీ ఎలాగైతేనేం.. చాలా సందిగ్ధం నడుమ, సినిమా సెట్స్ మీదకు వెళుతోంది. హమ్మయ్య.. అని మహేష్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట.. ఓ పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఈ షెడ్యూల్‌లో తెరకెక్కిస్తారట. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్ అని అంటున్నారు.
పూజా హెగ్దే.. శ్రీలీల హీరోయిన్లు.!
ఈ సినిమా కోసం పూజా హెగ్దేని (Pooja Hegde) గతంలోనే హీరోయిన్‌గా ఖరారు చేశారు. ‘ధమాకా’ భామ శ్రీలీల (Sree Leela) కూడా ఈ ప్రాజెక్టులోకి వచ్చింది. సో, గ్లామర్ పరంగా.. కెవ్వు కేక అన్నమాట.!
Also Read: Malaika Arora.. తప్పేముంది అర్జున్.! ‘భంచిక్’ నిజం కాదా.?
చకచకా సినిమా నిర్మాణం జరిగిపోతే.. సినిమా వేగంగా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తే.. అంటూ మహేష్ అభిమానులు ఈ సినిమా గురించి చాలా ఆశలే పెట్టుకున్నారు.
ఔను మరి.. ఇది వేగంగా పూర్తయిపోతే, రాజమౌళి తెరకెక్కించే గ్లోబ్‌ట్రోటింగ్ కాన్సెప్ట్ మూవీకి మహేష్ రెడీ అయిపోవాలి కదా.!
రాజమౌళి – మహేష్ కాంబినేషన్‌లో రాబోయేది పాన్ వరల్డ్ సినిమా.! ఒక్క సినిమా కాదు.. పార్ట్ వన్.. పార్ట్ టూ.. ఇలా వస్తూనే వుంటాయట.! సో, మహేష్ – రాజమౌళి కాంబినేషన్ మీద అభిమానులు ఏ స్థాయి అంచనాలైనా పెట్టేసుకోవచ్చు.