Table of Contents
Malavika Mohanan Riding.. హీరోయిన్ మాళవిక మోహనన్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా చాలా ఎక్కువ. చేసింది తక్కువ సినిమాలే అయినా, ఆమె ‘డై హార్డ్’ అభిమానుల్ని సంపాదించుకుంది.
తమిళంలో ‘మాస్టర్’ సినిమాతో పాపులర్ అయిన ఈ బ్యూటీ, తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘హీరో’ అనే సినిమాలో నటించాల్సి వున్నా, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే ఈ బ్యూటీకి, అభిమానులు తరచూ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ సంధిస్తుంటారు.. వాటికి అంతకంటే ఇంట్రెస్టింగ్‌గా సమాధానాలిస్తుంటుంది మాళవిక మోహనన్.
Malavika Mohanan Riding బాహుబలికి వీరాభిమాని.!
‘బాహుబలి’కి మాళవిక మోహనన్ (Malavika Mohanan) వీరాభిమాని అట. ఒక్కో పార్ట్ పది నుంచి పదిహేను సార్లు చూసేసిందట.
Also Read: సొగసరి.. పదహారణాల తెలుగు అందం అనన్యమే సుమీ.!
అంటే, రెండు పార్టులూ… అదేనండీ ‘బాహుబలి ది బిగినింగ్’, ‘బాహుబలి ది కంక్లూజన్’ కలిపి మొత్తంగా 20 నుంచి 30 సార్లు చూసేసిందన్నమాట మాళవిక.
‘బాహుబలి’ తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిందనీ, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం గర్వపడేలా చేసిందనీ మాళవిక మోహనన్ చెప్పుకొచ్చింది.
బైక్ రైడింగ్ అంటే భలే ఇష్టమట.!
మాళవిక మోహనన్‌కి బైక్ రైడింగ్ అంటే చాలా చాలా ఇష్టమట. మన దేశంలో బైక్ రైడింగ్ సరదా తీరడంలేదని, విదేశాలకు వెళ్ళినప్పుడు ఏకధాటిగా.. ఎక్కువ దూరం బైక్ మీద తిరిగేస్తుందట.

ఈమధ్యనే ఇటలీకి వెళ్ళి ఏకంగా 18 గంటల పాటు డ్రైవింగ్ చేసేసిందట మాళవిక మోహనన్. ఆమె స్టామినాకి హేట్సాఫ్ చెప్పాల్సిందేనండోయ్.!
చాలామంది అందాల భామలకు బైక్ రైడింగ్ అంటే ప్రత్యేకమైన ఇష్టం వుంటుందిగానీ, మరీ ఇంతలాగానా.? 18 గంటలపాటు డ్రైవింగ్ అంటే నిజంగానే మామూలు విషయం కాదు.
డ్రైవింగ్ ఆషామాషీ వ్యవహారం కాదనీ, అనుక్షణం అప్రమత్తంగా వుండాలనీ, బైక్ డ్రైవింగ్ ఇంకా జాగ్రత్తగా చేయాల్సి వుంటుందంటూ డ్రైవింగ్ జాగ్రత్తలు కూడా చెప్పేస్తోందీ మాస్టర్ బ్యూటీ.
హీరోయిన్ కాకపోయి వుంటే.!
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాననే సమాధానం చాలామంది నటీనటుల నుంచి వినిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా సమాధానమిచ్చింది మాళవిక మోహనన్ (Malavika Mohanan).
ఒకవేళ యాక్టర్ కాకపోయి వుంటే, ఖచ్చితంగా సినిమాటోగ్రాఫర్‌ని అయి వుండేదానన్ని మాళవిక, స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చింది.
సినిమాటోగ్రఫీ విభాగంలో మహిళలు చాలా చాలా తక్కువ. ఒకవేళ యాక్టర్ అవకపోయి వుంటే, సినిమాటోగ్రాఫర్‌గా మాళవిక మంచి గుర్తింపు తెచ్చుకునేదేమో.!

విహార యాత్రలకు వెళ్ళేటప్పుడు, కెమెరాతోనే ఎక్కువ టైమ్ గడిపేస్తుందట. కార్లను డ్రైవ్ చేయడం, బైక్‌లను డ్రైవ్ చేయడం చాలా చాలా ఇష్టం మాళవిక మోహనన్‌కి.
Also Read: Kangana Ranaut.. వామ్మో.! ఏం తెలివి.? క్లీన్ బౌల్డ్ చేసేస్తోందే.?
కార్ల కంటే కూడా హై ఎండ్ బైక్స్ అంటే మాళవిక మోహనన్‌కి అమితమైన ఇష్టమట. రోడ్డు ప్రయాణంలో ప్రమాదాలున్నా.. ఆ కిక్కే వేరప్పా.! అంటోందీ బ్యూటీ.