Malavika Mohanan.. అప్పుడెప్పుడో మాళవిక మోహనన్ ‘మేకప్’ గురించి ఏవో వ్యాఖ్యలు చేసింది. తాజాగా మాళవిక వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేసింది.!
అవసరమా ఇదంతా.? హాస్పిటల్ సీన్‌లో కూడా ఓ ప్రముఖ నటి మేకప్‌తో నటించిందనీ, అది అసహజంగా అనిపించిందనీ మాళవిక ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.
మాళవిక సెటైర్లు వేసింది నయనతార మీదనే.! అప్పుడెప్పుడో జరిగిన వ్యవహారంపై ఇప్పుడు తీరిగ్గా నయనతార స్పందించడమేంటి.? కమర్షియల్ సినిమాల లెక్కలు వేరని చెప్పడం దేనికి.?
Malavika Mohanan విషయంలో లైట్ తీసుకోవాల్సింది పోయి..
నిజానికి, నయనతార సైలెంటుగా వుండటమే బెటర్. కానీ, భుజాలు తడుముకుంది. సో, గుమ్మడికాయల దొంగనని ఒప్పేసుకున్నట్లయ్యింది నయనతార.
Also Read: రష్మికకి షాక్.! డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.!
ఈ మొత్తం వ్యవహారంలో మాళవిక మోహనన్‌కి ఎడ్జ్ లభించింది. రేపో మాపో ఆమె స్పందిస్తే.. అది మళ్ళీ వేరేలా వుండొచ్చు.
నయనతార స్టార్‌డమ్ వేరు.. మాళవిక మోహనన్ ఇమేజ్ వేరు. అలాంటప్పుడు, లైట్ తీసుకోకుండా నయనతార (Nayanthara) ఎందుకు ఆనాటి గాయాన్ని కెలుక్కున్నట్లు.?
ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. నయనతార అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు. మాళవిక మోహనన్ అభిమానులు గుస్సా అవుతున్నారు.