Malvika Nair Manasu నటీనటుల్లో అందరూ ఒకేలా ఆలోచించరు. కొందరి ఆలోచనలు కమర్షియల్‌గా వుంటాయి, ఇంకొందరివి క్రియేటివ్‌గా, డైనమిక్‌గా వుంటాయ్.!
కేవలం డబ్బు కోసమే సినిమాలు చేసే నటీనటులుంటారు. ఎలాగోలా పేరొస్తే చాలని ఇంకొందరు అనుకుంటుంటారు. మరికొందరేమో, డబ్బుతో పనేముంది.? మంచి పేరు రావాలని ఆలోచిస్తారు.
మనసుకు నచ్చితేనే.. అంటే, అవకాశాలొచ్చేదెలా.?
అయినా, మనసు చంపుకుని సినిమాలు చేయాల్సి వస్తే.. అదీ సబబు కాదు కదా.!
కాస్త పట్టు విడుపులుండాలి మరి.! సినిమా అంటే, కళ మాత్రమే కాదు, వ్యాపారం కూడా.!
Mudra369
ఇంతకీ, మాళవిక నాయర్ ఏ బాపతు.? ‘నేనైతే మనసుకు నచ్చిన సినిమాలే చేస్తా’ అంటోంది మాళవిక నాయర్.
Malvika Nair Manasu.. ఛాన్సులొస్తున్నాయ్‌గానీ..
‘ఎవడే సుబ్రమణ్యం’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘కళ్యాణ వైభోగమే’, ‘ట్యాక్సీవాలా’ ఇలా పలు సినిమాల్లో మాళవిక నటించి మెప్పించింది. నటిగా మంచి పేరు కూడా సంపాదించుకుంది.
హిట్టూ.. ఫట్టూ.. ఎవరికైనా మామూలే.! హిట్టూ, ఫ్లాపుకి.. అతీతంగా, మాళవిక నాయర్‌కి అవకాశాలొస్తున్నాయ్. కానీ, కేవలం కొన్ని సినిమాల్నే ఒప్పుకుంటోందామె.

అదేమని అడిగితే, ‘నాకేమీ తొందర లేదు. మంచి సినిమా అని నేను నమ్మినప్పుడు మాత్రమే ఒప్పుకుంటా.. నా మనసుకి కథ నచ్చాలి..’ అని చెప్పింది మాళవిక (Malvika Nair) తాజాగా ఓ ఇంటర్వ్యూలో.
ఆన్ స్క్రీన్ ముద్దు ముచ్చట.!
చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేసిన మాళవిక (Malavika Nair), నిజానికి కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వుంటే.. మంచి స్టార్‌డమ్ సంపాదించుకునేదే.!
Also Read: ‘ఆస్కార్’ నాటు: అప్పడు చరణ్.. ఇప్పుడు దీపిక.!
అన్నట్టు, ఆన్ స్క్రీన్ లిప్ లాక్స్ విషయంలో మాళవికకి అభ్యంతరాలేమీ లేవట. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలో నాగ శౌర్యతో ముద్దు సన్నివేశాల్లో నటించింది.

‘సినిమా చూడండి.. అందులో కథకి అనుగుణంగానే ముద్దు సన్నివేశాలుంటాయ్.. అవేవీ కావాలని జొప్పించినవి కావు..’ అన్నది మాళవిక నాయర్ (Malvika Nair) వెర్షన్.
అంటే, ఆన్ స్క్రీన్ ముద్దు సన్నివేశమైనా.. మనసుకు నచ్చాల్సిందే మరి.!